YS Sharmila : 2023 ఎన్నికలే టార్గెట్? షర్మిల వ్యూహకర్త ఎవరో తెలిస్తే నోరెళ్లబెడతారు?
YS Sharmila : వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్నారు అనేది అందరికీ తెలిసిందే. కానీ.. ఆమె పార్టీ పెట్టి ఎలా తెలంగాణలో ముందుకు వెళ్తారు. పార్టీని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్తారు. అధికార పార్టీ టీఆర్ఎస్ ను ఎలా ఎదుర్కొంటారు.. అనేది మాత్రం పెద్ద ప్రశ్నగానే ఉంది. ఎందుకంటే.. రాజకీయాల్లో పెద్దగా అవగాహన, అనుభవం లేని షర్మిల.. తెలంగాణలో ఎలా ముందుకెళ్తారు.. అనేది అందరికీ పెద్ద సందేహంలా మిగిలిపోయింది.
అసలు.. ఆమె తెలంగాణలో ఎందుకు పార్టీ పెడుతున్నారు? ఏపీలో ఎందుకు పెట్టడం లేదు? తన అన్న, ఏపీ సీఎం వైఎస్ జగన్ తో తనకు ఏవైనా విభేదాలు ఉన్నాయా? అనే విషయాలన్నీ పక్కన పెడదాం. కానీ.. తన పార్టీకి సంబంధించిన కొన్ని కొన్ని విషయాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి.
YS Sharmila : అప్పుడు వైసీపీ పార్టీకి.. ఇప్పుడు షర్మిల పార్టీకి
తాజాగా షర్మిల పార్టీ గురించి తెలిసిన విషయాలు ఏంటంటే.. తను తెలంగాణలో 2023 ఎన్నికలను టార్గెట్ గా చేసుకున్నారట. దాని కోసమే పక్కా ప్లాన్ వేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే అప్పటిలోపు తన పార్టీని తెలంగాణ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు షర్మిల ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
అందుకే.. 2019 ఎన్నికల్లో ఏపీలో వైఎస్సార్సీపీ పార్టీ అధికారంలోకి రావడానికి వ్యూహాలు రచించిన.. వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నే తన పార్టీకి కూడా వ్యూహకర్తగా షర్మిల నియమించుకోనున్నట్టు తెలుస్తోంది. 2023 ఎన్నికల్లో తెలంగాణలో షర్మిల పార్టీ గెలుపు కోసం ఆయన పనిచేయనున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ లో ఈసంవత్సరం మే లోపు ఎన్నికలు పూర్తవుతాయి. ఆ తర్వాత ఆయన తెలంగాణకు వచ్చి.. షర్మిల పార్టీ కోసం పనిచేయనున్నట్టు తెలుస్తోంది.
షర్మిల కూడా త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేయబోతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో ఉన్న అన్ని ప్రాంతాల్లో ఆమె పాదయాత్ర చేస్తారని తెలుస్తోంది. చూద్దాం మరి.. ప్రశాంత్ కిషోర్ వ్యూహం ఏమేరకు తెలంగాణలో పనిచేస్తుందో?