YS Sharmila : ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పుంజుకుంటోంది. మొన్న కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలుసు కదా. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం డీకే శివకుమార్. అందుకే.. ఇప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తీసుకునే కీలక నిర్ణయాల్లో డీకే శివకుమార్ ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లోనూ ఆయన ఇన్వాల్వ్ అవుతున్నారు. సోనియా గాంధీ కూడా డీకే శివకుమార్ ను ప్రతి విషయంలో ఇన్వాల్వ్ చేస్తున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం శివకుమార్ తన ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణతో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే పరిస్థితులు ఉన్నాయి. కర్ణాటక ఎఫెక్ట్ ఖచ్చితంగా తెలంగాణలో ఉండబోతోంది. అలాగే.. అధికార బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. అందుకే.. తెలంగాణ మీద కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. తమతో కలిసి వచ్చే వాళ్లను ప్రోత్సహిస్తోంది. పార్టీలోకి చేరికలు కూడా పెరుగుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల సారథ్య బాధ్యతలను డీకే శివకుమార్ తీసుకోవడంతో ఇక తెలంగాణలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం వచ్చినట్టే అని భావించాలి.
అయితే.. వైఎస్ షర్మిల పార్టీ వైఎస్సార్టీపీ కాంగ్రెస్ లో విలీనం అవడం దాదాపు లాంఛనమే అని అనుకోవాలి. దానికి కారణం డీకే శివకుమార్. షర్మిల పార్టీని కాంగ్రెస్ లో కలపాలనే ప్రతిపాదన తీసుకొచ్చిందే ఆయన. ఎందుకంటే.. వైఎస్సార్ కూతురుగా షర్మిలతో డీకే శివకుమార్ కు సత్సంబంధాలే ఉన్నాయి. షర్మిల కూడా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలవగానే బెంగళూరు వెళ్లి డీకే శివకుమార్ ను కలిసి వచ్చారు. అప్పుడే డీకే కూడా షర్మిలకు మంచి ఆఫర్ ఇచ్చారట. కాంగ్రెస్ లో విలీనం చేయాలని కోరారట. డీకే చెప్పారు కాబట్టే షర్మిల కూడా ఈ విషయంపై పునరాలోచిస్తున్నట్టు తెలుస్తోంది. డీకే నాయకత్వంలో తెలంగాణలోనే షర్మిలకు కీలక పదవి కూడా ఇచ్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతా ఓకే అయితే.. ఇక షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవ్వడం పక్కా అని చెప్పుకోవచ్చు.
Maharashtra : మహారాష్ట్ర చరిత్రలో ప్రతిపక్ష నాయకుడు లేకపోవడం ఇదే తొలిసారి అని శివసేన నాయకురాలు షైన ఎన్‌సి అన్నారు.…
Ajit Pawar : మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ, శివసేన, ఎన్సీపీల మహాయుతి కూటమి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే…
Hyderabad Air Quality : ఇన్నాళ్లు ఢిల్లీలో వాయి కాలుష్యం ఎక్కువ అని వినేవాళ్లం. కాని ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా…
Devi Sri Prasad : పుష్ప2 మ్యూజిక్ విషయంలో దేవి శ్రీ ప్రసాద్‌కి నిర్మాతలకి గొడవలు జరిగినట్టు అనేక వార్తలు…
Groom Chase : అచ్చం సినిమాలో జరిగిన చేజ్ సీన్ విధంగా బయట ఓ సంఘటన జరిగింది. విలన్ పారిపోతుంటే…
Allu Arjun Pushpa 2 Kissik Song : ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా పుష్న2…
Kangana Ranaut : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి ఘోర పరాజయం తర్వాత, బాలీవుడ్ నటి, బిజెపి…
Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం మరి కొద్ది రోజులలో…
This website uses cookies.