YS Sharmila : పార్టీతో పాటు కొత్త చానెల్ కూడా? షర్మిల దూకుడు మామూలుగా లేదు?
YS Sharmila : ప్రస్తుతం ఎక్కడ చూసినా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్న ఒకే ఒక పేరు వైఎస్ షర్మిల. తెలంగాణలో ఆమె గురించే చర్చ.. ఏపీలోనూ ఆమె గురించే చర్చ. ఇక్కడ టీఆర్ఎస్ నేతలు ఆమె గురించే చర్చిస్తున్నారు. అక్కడ వైసీపీ నేతలు కూడా ఆమె గురించే చర్చిస్తున్నారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా వైఎస్ షర్మిల పెడుతున్న పార్టీ వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న రెండు పార్టీలు తెగ టెన్షన్ పడిపోతున్నాయి.
YS Sharmila : తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తా
ఇప్పటికే తెలంగాణలో పార్టీ పెడుతున్నట్టు షర్మిల ప్రకటించారు. దీంతో చాలా రోజుల నుంచి వస్తున్న ఊహాగానాలకు ఆమె తెరదించారు. బెంగళురు నుంచి డైరెక్ట్ గా హైదరాబాద్ లోని లోటస్ పాండ్ కు చేరుకున్న షర్మిల.. పార్టీ పెడుతున్నట్టు వైఎస్సార్ అభిమానుల ముందు ప్రకటించారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తేవాలన్నదే తన లక్ష్యమన్నారు.
లోటస్ పాండ్ లో నిర్వహించిన ఈ సన్నాహక సమావేశాన్ని అన్ని తెలుగు చానెళ్లు పార్టీలకు అతీతంగా కవరేజ్ ఇచ్చాయి. బాగానే షర్మిల పార్టీపైన డిబేట్లు నిర్వహించాయి. తెలంగాణ, ఏపీ అనే తేడా లేకుండా.. అన్ని చానెళ్లు కవరేజ్ ఇవ్వగా.. ఒక్క సాక్షి చానెల్ మాత్రం అస్సలు ఆ కార్యక్రమం జోలికే పోలేదు.
ఇదివరకు షర్మిల పాదయాత్ర చేసినప్పుడు.. వేరే కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు షర్మిలకు లైవ్ కవరేజ్ చేసిన సాక్షి మీడియా.. ఈసారి మాత్రం.. కవరేజ్ ఇవ్వలేదు.
ఒకరి మీద ఆదారపడటం ఎందుకు? ఒక చానెల్ ను నమ్ముకోవడం ఎందుకు అని అనుకున్నారో ఏమో కానీ.. షర్మిల కూడా సొంత చానెల్ పెట్టేందుకు సమాయత్తం అవుతున్నారట. పార్టీతో పాటే చానెల్ కూడా స్టార్ట్ చేసేందుకు ఇప్పటికే ప్రయత్నాలు కూడా ముమ్మరంగా సాగుతున్నాయట.
బెంగళూరులో చానెల్ కు సంబంధించిన అన్ని కార్యక్రమాలను స్టార్ట్ చేశారట. చానెల్ నిర్వహణ బాధ్యతను షర్మిల భర్త బ్రదర్ అనీల్ కుమార్ చూసుకోనున్నారట. అలాగే.. టీవీ 9 మాజీ సీఈవో రవి ప్రకాశ్ కూడా ఈ చానెల్ లో చేరనున్నట్టు తెలుస్తోంది.
మొత్తం మీద పార్టీతో పాటు ఒకేసారి చానెల్ ను కూడా ప్రకటించి.. తెలంగాణలో దూసుకుపోవడమే ధ్యేయంగా షర్మిల అడుగులు వేస్తున్నారు. చూద్దాం మరి.. షర్మిల తన రాజకీయ ప్రయాణాన్ని ఎలా ప్రారంభిస్తారో?