YS Sharmila : జగన్ ప్రభుత్వానికి వైఎస్ షర్మిల వార్నింగ్?
YS Sharmila : వైఎస్ షర్మిల.. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. త్వరలోనే తెలంగాణలో పార్టీని ప్రకటించబోతున్న షర్మిల.. ఇప్పటికే తెలంగాణ రాజకీయాల్లో తన వంతు పాత్ర పోషిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురుగా తను రాజన్న పాలనను తేవాలన్న సదుద్దేశంతో తెలంగాణలో పార్టీ పెట్టేందుకు ఆమె ముందుకు వచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలు తిరిగి.. వైఎస్సార్ అభిమానులతో భేటీ అయ్యారు. చాలామంది నేతలను కలిశారు. త్వరలోనే పార్టీ పెట్టి.. ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనబోతున్నారు షర్మిల.
ఆ విషయం పక్కన పెడితే.. తెలంగాణ, ఏపీ మధ్య.. నీటి కేటాయింపులు రోజు రోజుకూ ముదిరిపోతున్నారు. జలవివాదం రచ్చకెక్కుతోంది. ఇప్పటికే తెలంగాణ మంత్రులు, ఇతర నేతలు.. వైఎస్సార్ పై విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం మీద కూడా విమర్శలు చేస్తున్నారు. అయితే.. వాళ్ల వ్యాఖ్యలను.. ఏపీ మంత్రులు కూడా తిప్పికొడుతున్నారు. ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న నీటి కేటాయింపుల సమస్యపై తాజాగా వైఎస్ షర్మిల కూడా స్పందించారు.
YS Sharmila : ట్విట్టర్ లో వైఎస్ షర్మిల ట్వీట్
తాజాగా వైఎస్ షర్మిల తెలంగాణకు నీటి కేటాయింపుల విషయంపై ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోబోం. తెలంగాణకు రావాల్సిన ఒక్క నీటి చుక్క కూడా రావాల్సిందే. దాన్ని వదులుకునే సమస్యే లేదు. దాని కోసం.. అవసరమైతే ఎవ్వరితోనైనా పోరాడేందుకు మేము సిద్ధం.. అంటూ తను మాట్లాడుతున్న ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు షర్మిల.
వైఎస్ షర్మిల చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశం అయింది. ఎందుకంటే.. ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన నీటి కేటాయింపుల విషయంలో అడ్డుపడేది ఏపీ ప్రభుత్వమే. అంటే.. ఇన్ డైరెక్ట్ గా ఏపీ ప్రభుత్వానికి, తన అన్న, ఏపీ సీఎం వైఎస్ జగన్ ను వైఎస్ షర్మిల వార్నింగ్ ఇచ్చారా? అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా.. భవిష్యత్తులో కూడా జగన్ తో రాజకీయ పోరుకు షర్మిల సై అంటే సై అంటారని తెలుస్తోంది. చూద్దాం మరి.. భవిష్యత్తులో ఏం జరుగుతుందో?
తెలంగాణకు సంబంధించిన ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోబోం..
అందుకు అవసరమైతే ఎవరితోనైనా పోరాడడానికైనా మేము సిద్ధం..https://t.co/Kc6F1vkpLW— YS Sharmila (@realyssharmila) June 28, 2021