Ys Vijayamma : వైఎస్ విజయమ్మ రాజీనామా.. వైసీపీ అంతర్గత వ్యవహారమే.! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ys Vijayamma : వైఎస్ విజయమ్మ రాజీనామా.. వైసీపీ అంతర్గత వ్యవహారమే.!

Ys Vijayamma : గౌరవ అధ్యక్షురాలనే పదవికి వైఎస్ విజయమ్మ రాజీనామా చేయడం అనేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అతర్గత వ్యవహారం. అది ఓ గౌరవ పదవి మాత్రమే. ఆ పదవికి ప్రత్యేకంగా అధికారాలు ఏమీ వుండవు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తల్లిగా వైఎస్ విజయమ్మకు పార్టీలో ఎప్పుడూ ప్రత్యేకమైన గౌరవం ఖచ్చితంగా వుంటుంది.. గౌరవాధ్యక్షురాలిగా ఆమె కొనసాగినా, కొనసాగకపోయినా. ఎప్పుడైతే వైఎస్ విజయమ్మ, వైసీపీకి సైతం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారో, టీడీపీ అనుకూల మీడియా […]

 Authored By prabhas | The Telugu News | Updated on :10 July 2022,8:20 am

Ys Vijayamma : గౌరవ అధ్యక్షురాలనే పదవికి వైఎస్ విజయమ్మ రాజీనామా చేయడం అనేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అతర్గత వ్యవహారం. అది ఓ గౌరవ పదవి మాత్రమే. ఆ పదవికి ప్రత్యేకంగా అధికారాలు ఏమీ వుండవు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తల్లిగా వైఎస్ విజయమ్మకు పార్టీలో ఎప్పుడూ ప్రత్యేకమైన గౌరవం ఖచ్చితంగా వుంటుంది.. గౌరవాధ్యక్షురాలిగా ఆమె కొనసాగినా, కొనసాగకపోయినా. ఎప్పుడైతే వైఎస్ విజయమ్మ, వైసీపీకి సైతం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారో, టీడీపీ అనుకూల మీడియా పండగ చేసుకోవడం మొదలైంది.

అసలు విజయమ్మ రాజీనామాకీ, టీడీపీ పండగ చేసుకోవడానికీ ఏమైనా సంబంధం వుందా.? కాస్త చరిత్రలోకి తొంగి చూస్తే, టీడీపీ నుంచి స్వర్గీయ ఎన్టీయార్‌ని గెంటేసిన చరిత్ర చంద్రబాబుది.! సో, చంద్రబాబు అండ్ టీమ్, విజయమ్మ వైసీపీకి రాజీనామా చేయడంపై మాట్లాడటానికే నైతిక హక్కుని కలిగి లేరు. ఇక, జనసేన విషయానికొస్తే, ఆ పార్టీ ఈ విషయంలో కాస్త హుందాగానే స్పందించింది. ‘అది వైసీపీ అంతర్గత వ్యవహారం..’ అని పలువురు జనసేన నాయకులు వ్యాఖ్యానించారు.

Ys Vijayamma Resign TDP Celebration

Ys Vijayamma Resign, TDP Celebration

మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం సారధిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత ఆయన ఆ బాధ్యతల నుంచి తప్పించుకున్న సంగతి తెలిసిందే. రాజకీయాల్లో ఇలాంటివన్నీ సర్వసాధారణమే. తెలంగాణలోనూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన వల్ల మేలు పొందిన ప్రజలున్నారు. వారు గనుక వైఎస్ షర్మిలను అధికార పీఠమెక్కించాలనుకుంటే, విజయమ్మ శ్రమ ఫలిస్తుంది. ఆ దిశగా ఆమె ప్రయత్నించడంలో తప్పేమీ లేదు కదా. నైతికత కోణంలో, వైసీపీకి విజయమ్మ రాజీనామా చేశారని ఎందుకు అర్థం చేసుకోకూడదు.?

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది