YS Vijayamma : షర్మిల పార్టీపై తొలిసారి స్పందించిన వైఎస్ విజయమ్మ?
YS Vijayamma : వైఎస్సార్ కుటుంబానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా అభిమానం ఉంది. ఏపీలోనే కాదు… తెలంగాణలో కూడా వైఎస్సార్ అభిమానులు ఉన్నారు. కాకపోతే వైఎస్ జగన్ మాత్రం తన పరిధిని కేవలం ఏపీ వరకే విస్తరించుకున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల తన పార్టీ వైఎస్సార్సీపీని తెలంగాణలో కొనసాగించలేకపోయారు. ఏది ఏమైనా… ఏపీలో ముఖ్యమంత్రి అయి కొత్త ఒరవడిని సృష్టించడంతో పాటు.. తండ్రికి తగ్గ తనయుడిగా వైఎస్ జగన్ గుర్తింపు తెచ్చుకున్నారు.
మరోవైపు వైఎస్ షర్మిల… తెలంగాణ కోడలు కాబట్టి… అలాగే తెలంగాణలో వైఎస్ అభిమానులు కోట్లలో ఉన్నారు కాబట్టి…. షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టాలని డిసైడ్ అయ్యారు.అయితే… ఓవైపు ఎల్లో మీడియాలో వైఎస్సార్ కుటుంబంపై చేస్తున్న తప్పుడు ప్రచారం, మరోవైపు జగన్, షర్మిల.. ఇద్దరికి పడటం లేదని… అందుకే… షర్మిల తెలంగాణలో పార్టీ పెడుతున్నారని మీడియాలో వస్తున్న కథనాలు… వీటన్నింటికీ చెక్ పెట్టడం కోసం వైఎస్సార్ భార్య, వైఎస్ జగన్, షర్మిల తల్లి వైఎస్ విజయమ్మ… రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.ఈ లేఖలో ఎల్లో మీడియా తమ కుటుంబంపై చేస్తున్న దుష్ప్రచారంపై, షర్మిల కొత్త పార్టీపై, షర్మిల, జగన్ మధ్య ఉన్న విభేదాలపై ఆమె స్పందించారు.
YS Vijayamma : షర్మిలమ్మ తన రాజకీయ భవిష్యత్తు తెలంగాణలో ఉందని గట్టిగా నమ్మింది
షర్మిల తన రాజకీయ భవిష్యత్తు తెలంగాణలో ఉందని గట్టిగా నమ్మిందని…. ఓదార్పు యాత్ర అయినా… పాదయాత్ర అయినా… తెలంగాణలో అవకాశం అన్నకు కాకుండా… దేవుడు తనకు ఇచ్చాడంటే దానికి అర్థం తెలంగాణ ప్రజలతో తనకు ఉన్న అనుబంధాన్ని దేవుడు ఆనాడే రాశాడని షర్మిల నమ్మిందని విజయమ్మ లేఖలో పేర్కొన్నారు.అందుకే తెలంగాణలో షర్మిలమ్మ ముందడుగు వేస్తోందని… ఎల్లో మీడియా పిచ్చిరాతల్లో నా బిడ్డల మధ్య విభేదాలు తీసుకురావాలన్న దిగజారుడు ప్రయత్నాలు కనిపిస్తున్నాయని విజయమ్మ వాపోయారు. అయితే… అది ఏనాటికీ జరగని పని అని విజయమ్మ స్పష్టం చేశారు.నా పిల్లలు ఇద్దరూ ప్రజాసేవలో ఉన్నారు. పట్టుదలతో అడుగులు ముందుకు వేస్తున్నారు. ఎలాంటి ఎదురుగాలిని అయినా తట్టుకొని జగన్ బాబు నిలబడ్డాడు. పరిపాలనలో కూడా తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకుంటున్నాడు. మహానేతకు భార్యగా, ఏపీ ముఖ్యమంత్రికి తల్లిగా ఉన్న నేను గర్వపడతానా? లేక కుంగిపోతానా? అంటూ లేఖలో విజయమ్మ స్పష్టం చేశారు.