YS Viveka Murder Case : వైఎస్ వివేకా కూతురు సునీతా రెడ్డికి బెదిరింపులు? ఢిల్లీలో సీబీఐ అధికారులతో సునీతా?
YS Viveka Murder Case : వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు రోజు రోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతోంది. ఆయన మర్డర్ కేసును సాల్వ్ చేయాలని వివేకా కూతురు సునీతా రెడ్డి చాలా రోజుల నుంచి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ… ఆమెను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. చివరకు తనకే బెదిరింపులు వస్తున్నాయని.. ఈ కేసును ఇక్కడితో వదిలేయాలంటూ తనను బెదిరిస్తున్నారంటూ సునీత సంచలన ఆరోపణలు చేశారు.
ఆమె తాజాగా ఢిల్లీకి వెళ్లి సీబీఐ అధికారులను కలిశారు. ఆయన హత్య కేసును త్వరగా పరిష్కరించాలంటూ సీబీఐ ఉన్నతాధికారులను ఆమె కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సునిత.. సీబీఐ అధికారులు కూడా ఈ హత్య కేసును పట్టించుకోవడం లేదంటూ స్పష్టం చేశారు. కడపలో ఇటువంటి హత్యలు కామన్ అంటూ.. సీబీఐ అధికారులు వ్యాఖ్యానించారని ఆమె వాపోయారు.
వివేకా హత్య జరిగి రెండేళ్లు దాటినా… ఇప్పటి వరకు నిందితులను పట్టుకోలేదని.. సాక్షులు కూడా చనిపోతున్నారని…. కేసును వదిలేసుకోవాలంటూ తననే బెదిరిస్తున్నారని ఆమె మీడియా ముందు తెలిపారు.ఇంకా ఎంతమందిపై ఇలా దాడులు చేస్తారు. వివేకానందరెడ్డి…. మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు, ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి బాబాయి.. అయినా కూడా తనకు న్యాయం చేయకుండా కడప ఇటువంటి హత్యలు కామన్ అంటూ సీబీఐ అధికారులు చెప్పడం ఏంటి? అంటూ సునీతా ప్రశ్నించారు.
YS Viveka Murder Case : నాకు షర్మిల మద్దుతుగా నిలిచింది
నా ఈ పోరాటంలో నాకు షర్మిల మద్దతుగా నిలిచిందని సునీత స్పష్టం చేశారు. తప్పు జరిగిన విషయం షర్మిలకు కూడా తెలుసని ఆమె అన్నారు. విచారణను కావాలని సరిగ్గా చేయడం లేదు. ఇంకా ఎంత కాలం న్యాయం కోసం వేచి చూడాలి. న్యాయం ఆలస్యం అవుతోందంటే….. అన్యాయం చేసినట్టే లెక్క. వివేకానందరెడ్డికి శత్రువులు ఎవరూ లేరు. రాజకీయ కారణాలతోనే ఈ హత్య జరిగి ఉంటుంది. న్యాయం జరిగే వరకు నేను పోరాడుతూనే ఉంటా.. అని సునీత స్పష్టం చేశారు.