YSRCP : ‘గడప గడపకు మన ప్రభుత్వం’ పై సీఎం క్యాంపు కార్యాలయంలో వర్క్‌షాప్‌

YSRCP : వైఎస్సార్ సీపీ రీజినల్‌ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, జిల్లా ఇంఛార్జ్‌ మంత్రులు, ముఖ్య నేతలతో పాటు, 175 నియోజకవర్గాల సమన్వయకర్తల హాజరు సమావేశంలో చర్చ జరిగిన కీలక అంశాలు సచివాలయాల పరిధిలో పార్టీ కన్వీనర్లుగా సమర్థులైన వారే ఉంటారు : నాయకత్వం వహించే సామర్థ్యం ఉన్న కార్యకర్తలను సచివాలయ కన్వీనర్లుగా నియమించడం జరుగుతుంది. ఆ తర్వాత గృహ సారథుల నియామకం జరుగుతుంది. ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు చొప్పున నియమిస్తాం. జనవరిలో ఆసరా మూడో దఫా చెల్లింపు జరగబోతున్నది. రూ.6500 కోట్లు ఇవ్వబోతున్నాం. దానికి సంబంధించి ఇంటింటా ప్రచారం చేస్తూ, వారికి లేఖలు అందిస్తాం. ఆ తర్వాత గృహ సారథుల నియామకానికి సంబంధించి మరో దఫా వెరిఫికేషన్‌ ఉంటుంది.

ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలదే : సచివాలయాల కన్వీనర్లుగా ఎమ్మెల్యేలకు ఇష్టం వచ్చిన వారిని నియమించుకోవచ్చు. వారు సమర్థులై ఉండాలి. వారికి తప్పనిసరిగా స్మార్ట్‌ఫోన్‌ ఉండి తీరాలి. అయితే ఎక్కడా వలంటీర్లు గృహసారథులుగా ఉండకూడదు. అలాగే వారు ఆ 50 ఇళ్లకు సంబంధించిన వారై ఉండాలి.తప్పనిసరిగా పర్యటించాలి : జనవరి 21 నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఎమ్మెల్యేల ద్వారా ట్యాబ్‌ల పంపిణీ మొదలవుతుంది. పగలు ఆ కార్యక్రమం చేసి, సాయంత్రం గడప గడపకూ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాల్గొనాలి. అలాగే 1వ తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ. ఇక్కడ కూడా వారం రోజుల పాటు ఎమ్మెల్యేలు ఏదో ఒక మండలంలో పర్యటించాలి. సాయంత్రం గడప గడపకూ కార్యక్రమంలో పాల్గొనాలి. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్దేశించిన విధంగా జరగాలి. ప్రతి సచివాలయ పరిధిలో కనీసం రెండు రోజులు.. రోజుకు కనీసం 6 గంటల పాటు తిరగాలి.

cm ys jagan work shop on gadapa gadapaki mana prabhutvam YSRCP

అలా తిరగని ఎమ్మెల్యేలు.. మరోసారి ఆయా సచివాలయాలు సందర్శించాలి. ప్రతి ఇంటికి వెళ్లాలి.ప్రతి ఇంట్లో కనిసం 5 నిమిషాలు గడిపి, వారికి ప్రభుత్వం వల్ల కలిగిన ప్రయోజనాలు వివరించాలి. ప్రతి ఇంటికి వెళ్లాలి : ఒక వేళ ఒక గ్రామంలో రెండు రోజుల్లో మొత్తం తిరగలేమనుకుంటే, మూడు, నాలుగు రోజుల టైమ్‌ తీసుకొండి. కానీ ప్రతి ఇంటికి వెళ్లండి. ఎక్కడా తొందరపడకూడదు. మొక్కుబడిగా పని చేయొద్దు. ఒక ఊరు తీసుకుంటే కచ్చితంగా పూర్తి చేయండి. లేకపోతే మీరు తమ ఇంటికి రాలేదని, వారు వ్యతిరేకం అయ్యే అవకాశం ఉంది. వారు మనకు ఓటేయరని తెలిసినా, మీరు పోవడం మానకండి. ఎందుకంటే వారికి ఎంత మంచి చే«శామన్నది మన దగ్గర రికార్డులు ఉన్నాయి. వాటిని చిరునవ్వుతో వివరిస్తే, వారి మనస్సు మారొచ్చు. కాబట్టి ప్రతి గ్రామానికి వెళ్లండి. ప్రతి ఇల్లు సందర్శించండి.

పనుల్లో రాజీ వద్దు : అలాగే గ్రామాల్లో అత్యధిక ప్రభావం చూపే (హై ఇంప్యాక్ట్‌ వర్క్‌) పనులనే గుర్తించండి. ఎక్కడా స్వప్రయోజనాలు ఆశించకండి. ఎవరినో సంతోషపర్చాలని కూడా ఆలోచించొద్దు. ఆ పనుల కోసం ప్రతి సచివాలయానికి కేటాయిస్తున్న నిధుల్లో ఎక్కడా వెనకడుగు వేయడం లేదు. అందువల్ల మీరు పనుల ప్రాధాన్యతను గుర్తించి, అక్కడికక్కడే ప్రతిపాదనలతో అప్‌లోడ్‌ చేస్తే, వెంటనే ఆమోదించడం జరుగుతుంది. మీరంతా మళ్లీ గెలవాలి : ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, మీ మీద నాకు ప్రేమ ఎక్కువ. మీలో ఎవ్వర్నీ పోగొట్టుకోవడం నాకిష్టం లేదు. మీ అందరినీ మళ్లీ చట్టసభలో చూడాలి. అదే నా కోరిక. మనం మన బాధ్యత సక్రమంగా నెరవేర్చకపోతే, కోట్ల మంది నష్టపోతారు. ఇవాళ రాష్ట్రంలో కులాల మధ్య కాదు.. క్లాస్‌ల మధ్య యుద్ధం జరుగుతోంది.

పేదలు, పెత్తందార్ల మధ్య యుద్ధం జరుగుతోంది. ప్రతి పేదవాడికి ప్రతినిధి ఎవరంటే మనమే. మనం నష్టపోతే పేదవారు నష్టపోతారు. మనం పొరపాటున కూడా అధికారంలోకి రాకపోతే, రాష్ట్రంలో ఉన్న ఏ పేదవాడికి కూడా న్యాయం జరగదు. మోసంతో కూడిన రాజకీయాలు. ప్రజలను ఉపయోగించుకుని వదిలేసే రాజకీయాలు. వెన్నుపోటు రాజకీయాలు. అబద్ధాల రాజకీయాలు. ప్రజల మీద ప్రేమ లేని రాజకీయాలు. పేదవాడి మీద అస్సలు ప్రేమ లేని రాజకీయాలు. ఇవీ రాజకీయాలు. అలాంటి రాజకీయాలు వస్తాయి.కాబట్టి దయచేసి అందరూ ధ్యాస పెట్టండి. ప్రతి ఇంట్లో కనీసం రెండు, మూడు నిమిషాలు గడపండి. మీరు ఆ ఇంటికి కేటాయించే సమయం, మీకు ఎంతో మేలు చేస్తుంది. మీ నియోజకవర్గంలో ప్రతి ఇంటిని మీకు చేరువ చేస్తుంది.

ఎన్నికలకు ఇంకా 16 నెలలే.. మనకు ఎన్నికలకు ఇంకా 16 నెలల టైమ్‌ మాత్రమే ఉంది. కాబట్టి, ప్రతి ఇంట్లో కనీసం 5 నిమిషాలు గడిపి, ఆ ఇంటికి చేసిన మంచిని వివరించి, వారి ఆశీర్వాదం కోరండి. అప్పుడే వారి నుంచి మనకు సానుభూతి లభిస్తుంది. ఎందుకంటే, ఎన్నికల ముందు మీకు అంత సమయం ఉండదు. అసలు ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నాం? ఒక్కసారి ఆలోచించండి. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ఎందుకు చేస్తున్నామనేది దయచేసి ఆలోచన చేయండి.
మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏమంటే, మనం ప్రజా సేవకులం. అధికారం మన చేతిలో ఉన్నప్పుడు మనం గుర్తు పెట్టుకోవాల్సింది.. మనం అధికారం చలాయించడం కోసం కాదు మనం ఎమ్మెల్యేలుగా ఉండేది. మంత్రులుగా ఉండేది. నేను సీఎంగా ఉండేది. అందుకే ఎదిగేకొద్దీ ఒదగాలి.

ఈ అధికారం ఉండేకొద్దీ మనం ఇంకా ఎక్కువ ఒదగాలి. అప్పుడే ప్రజల నుంచి ఇంకా స్పందన లభిస్తుంది. ఈ వాస్తవాన్ని గుర్తించకపోతే, నష్టపోతాం. అందుకే ప్రతి ఇంట్లో మనం వారితో కనీసం 5 నిమిషాలు గడిపితే, ప్రజల మద్దతు మనకు దక్కుతుంది. మనల్ని ఆదరిస్తారని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.రూ.828 కోట్ల విలువైన పనులు : గడప గడపకూ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన అత్యంత ప్రాధాన్యత కలిగిన పనుల (హై ఇంప్యాక్ట్‌ వర్క్స్‌–హెచ్‌ఐడబ్ల్యూ స్‌)కు సంబంధించి చూస్తే.. 23,808 పనులకు సంబంధించి రూ.930.28 కోట్ల పనుల ప్రతిపాదనలు రాగా, వాటిలో 21,275 పనులకు అనుమతి ఇచ్చారు. ఆ పనుల విలువ రూ.828.45 కోట్లు. వాటిలో 17,905 పనులు మొదలు కాగా, ఆ విలువ రూ.662.14 కోట్లు.

Recent Posts

Rice | నెల రోజులు అన్నం మానేస్తే శరీరంలో ఏమవుతుంది? .. వైద్య నిపుణుల హెచ్చరికలు

Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…

1 hour ago

Montha Effect | ఆంధ్రప్రదేశ్‌పై మొంథా తుఫాన్ ఆగ్రహం .. నేడు కాకినాడ సమీపంలో తీరాన్ని తాకే అవకాశం

Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…

3 hours ago

Harish Rao | హరీశ్ రావు ఇంట్లో విషాదం ..బీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారానికి విరామం

Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…

5 hours ago

Brown Rice | తెల్ల బియ్యంకంటే బ్రౌన్ రైస్‌ ఆరోగ్యానికి మేలు.. నిపుణుల సూచనలు

Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…

6 hours ago

Health Tips | మారుతున్న వాతావరణంతో దగ్గు, జలుబు, గొంతు నొప్పి.. ఈ నారింజ రసం చిట్కా గురించి తెలుసా?

Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…

9 hours ago

Chanakya Niti | చాణక్య సూత్రాలు: ఈ మూడు ఆర్థిక నియమాలు పాటిస్తే జీవితంలో డబ్బు కొరత ఉండదు!

Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…

12 hours ago

Phone | రూ.15,000 బడ్జెట్‌లో మోటరోలా ఫోన్ కావాలా?.. ఫ్లిప్‌కార్ట్‌లో Moto G86 Power 5Gపై భారీ ఆఫర్!

Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…

23 hours ago

Cancer Tips | ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌కు కాళ్లలో కనిపించే ప్రారంభ సంకేతాలు .. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం

Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్‌, గుండెపోటు, స్ట్రోక్‌…

1 day ago