YS Jagan : ‘దత్తత’ వ్యూహాలతో వైఎస్ జగన్ రెడ్డిని ఢీకొనగలరా.?
YS Jagan : 2014 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేస్తే, జనసేన పార్టీ అప్పుడే కొత్తగా ఆవిర్భవించింది, ఆ టీడీపీ – బీజేపీ కూటమికి జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ మద్దతిచ్చారు. వాస్తవానికి అదే గోల్డెన్ టైమ్ జనసేనాని పవన్ కళ్యాణ్‌కి. అప్పట్లో చంద్రబాబు ఇచ్చిన చెత్త సలహా నేపథ్యంలో పవన్ కళ్యాణ్, తన రాజకీయ జీవితాన్ని అంధకారంలోకి నెట్టేసుకున్నారు. చరిత్ర చెబుతున్న సత్యమిది. లేకపోతే, 2019 ఎన్నికల్లో జనసేన పార్టీకి అంతటి దారుణమైన ఓటమి వచ్చి వుండేదే కాదు.నాయకుడంటే, జనంతో మమేకమవ్వాలి. రాజకీయాల్లో యాక్టివ్‌గా వుండాలి. కానీ, సినిమాలు చేస్తూ రాజకీయాల్లో కొనసాగాలన్న పవన్ కళ్యాణ్ ఆలోచనే అర్థం లేనిది.
ఓ ఎమ్మెల్యే లేదా ఓ ఎంపీ అటు సినిమాల్ని, ఇటు రాజకీయాల్ని బ్యాలెన్స్ చేసుకోవాల్సి వస్తే, కష్టమే అయినా అది సాద్యపడవచ్చు. సినీ నటి రోజా, కేవలం ఎమ్మెల్యేగా వున్న కాలంలో, బుల్లితెరపై కనిపించారు. కానీ, ఎప్పుడైతే మంత్రి పదవి వచ్చిందో, ఆమె గ్లామర్ ప్రపంచాన్ని వదిలేశారు.మంత్రి పదవి కంటే చాలా కష్టమైనది ఓ రాజకీయ పార్టీని నడపడం అనే పని. దాన్ని పవన్ కళ్యాణ్ సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నారు. పేరు పవన్ కళ్యాణ్‌ది పెత్తనం నాదెండ్ల మనోహర్‌దీ అయిపోయింది. పవన్ తనకు గుర్తొచ్చినప్పుడల్లా రాజకీయాలు చేస్తుంటారు. చూసేవాళ్ళకి ఇది, ‘చంద్రబాబు డైరెక్షన్‌లో పవన్ కళ్యాణ్ రాజకీయ యాక్టింగ్ చేస్తున్నారు’ అనిపిస్తే అందులో తప్పేముంది.?కౌలు రైతుల కోసమంటూ పవన్ కళ్యాణ్ తన జేబులోంచే డబ్బులు తీసి పంచుతున్నా,

YS jagan With adoption strategies Dhee
ఆ క్రెడిట్ చంద్రబాబు ఖాతాలోకి వెళ్ళిపోతోంది. వైసీపీ విమర్శిస్తోందని కాదు, పవన్ కళ్యాణ్ ఎంతో నమ్ముకున్న చంద్రబాబే అలా వెన్నుపోటు పొడుస్తున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ విషయంలో వైసీపీకి రాజకీయ వైరం కంటే, ఆయన పట్ల ఎంతో కొంత సానుభూతి వున్నా, ఆ సానుభూతి పొందేందుకూ జనసేనాని అనర్హుడు. ఆ స్థాయిలో ఇంకా చంద్రబాబు నీడనే వుంటూ, వైసీపీ మీద విమర్శలు చేస్తున్నారు.అందుకే, పదే పదే దత్త పుత్రుడంటూ వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేసేది. ఈ ‘దత్తత’ రాజకీయాలతో పవన్ కళ్యాణ్, 2019 ఎన్నికల కంటే తక్కువ ఓట్ల శాతాన్ని దక్కించుకున్నా వింతేమీ వుండదు. ఎందుకంటే, జనసేన పార్టీకి బలమైన జనసైనికులు అండగా వున్నా, అధినేత వ్యూహాత్మక తప్పిదాలు.. జనసేన పార్టీ కొంప ముంచుతున్నాయి.