Balakrishna : ఇదెక్కడి విడ్డూరం.. బాలకృష్ణకు మద్దతిస్తున్న వైసీపీ నేతలు? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Balakrishna : ఇదెక్కడి విడ్డూరం.. బాలకృష్ణకు మద్దతిస్తున్న వైసీపీ నేతలు?

 Authored By jagadesh | The Telugu News | Updated on :27 January 2021,8:09 am

Balakrishna – నందమూరి బాలకృష్ణ గురించేనా మీరు మాట్లాడేది అంటారా? అవును.. ఆయన గురించే. కానీ ఆయనకు వైసీపీ నేతలు ఎందుకు మద్దతు ఇస్తారు అంటారా? ఇక్కడే ఉంది అసలు తిరకాసు.. దాని కథాకామీసు ఏంటో తెలుసుకుందాం పదండి.

ysrcp gives full support to balakrishna

ysrcp gives full support to balakrishna

బాలకృష్ణ అంటే ఎవరు? సీనియర్ ఎన్టీఆర్ కొడుకు, టీడీపీ అధినేత చంద్రబాబు బావమరిది, వియ్యంకుడు. మరి… బాలకృష్ణకు వైసీపీ నుంచి ఎలా మద్దతు వస్తోంది… ఎలాంటి మద్దతు వస్తోంది అంటే… దానికి వైసీపీ నేతలు ఏమంటున్నారంటే.. టీడీపీకి అసలు సిసలు వారసుడు బాలకృష్ణ అని.. బాలకృష్ణనే టీడీపీ అధినేతగా చూడాలనుకుంటున్నామని.. వైసీపీ మంత్రులు అంటున్నారు. అలా అనేవాళ్లలో ముందు వరుసలో ఉంటారు మంత్రి కొడాలి నాని.

కొడాలి నానికి నందమూరి కుటుంబంపై ప్రేమ ఉంటుంది అనే విషయం తెలుసు కదా. అందుకే బాలకృష్ణ తనను ఎంత విమర్శించినా పెద్దగా పట్టించుకోరు నాని.

అందుకే బాలకృష్ణలో ఉన్న అసలు పౌరుషాన్ని తట్టి లేపే ప్రయత్నం చేస్తుంటారు. కానీ.. బాలకృష్ణకు పార్టీని నడిపే సత్తా లేదు. ఆయన రాజకీయాలకు పనికిరారు. సినిమాల్లో ఆయన పెద్ద స్టార్ కానీ.. రాజకీయాల్లో అంతగా రాణించలేదు. అందుకే ఆయన పెద్దగా రాజకీయాలను పట్టించుకోరు.

బాలకృష్ణ టీడీపీ అధ్యక్ష పదవి చేపడితే నేను మద్దతిస్తా?

బాలయ్యకు రాజకీయాలు పడవు అని తెలిసినా కూడా కొడాలి నాని.. సెటైర్ వేశారు బాలయ్యకు. ఒకవేళ బాలయ్య టీడీపీని తిరిగి బాబు నుంచి తీసేసుకుంటే… బాలకృష్ణ తిరిగి తాను టీడీపీ అధ్యక్షుడైతే మద్దతు ఇవ్వడానికి నేను రెడీ.. అంటూ బాలయ్యకు బంపర్ ఆఫర్ ఇచ్చారు కొడాలి నాని.

ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ పార్టీని మళ్లీ తన చేతుల్లోకి తీసుకునే హక్కు కేవలం బాలకృష్ణకు మాత్రమే ఉందని… ప్రస్తుతం మునిగిపోయే పరిస్థితిలో ఉన్న టీడీపీకి బాలయ్య మాత్రమే ఆదుకోగలరు.. అందుకే బాలయ్యకు నేను మద్దతు ఇస్తున్నా.. అంటూ కొడాలి నాని స్పష్టం చేశారు.

చూద్దాం మరి.. కొడాలి నాని మాటలను బాలకృష్ణ సీరియస్ గా తీసుకుంటారో లేదో?

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది