TDP : సంక్షేమ పథకాల నిలుపుదలకు టీడీపీ కుట్ర
TDP : ఏపీలో పేద ప్రజల కోసం అమలు చేయబడుతున్న సంక్షేమ పథకాలను నిలిపి వేయడం కోసం తెలుగు దేశం పార్టీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. మాజీ ఐపీఎస్ ఐఏఎస్ అధికారులతో ప్రభుత్వంపై విమర్శలు చేయించి ఆ విమర్శలను ఎల్లో మీడియాలో హైలెట్ చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుర్తించడం ద్వారా జనాల్లో మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారు.తెలుగు దేశం పార్టీ సంక్షేమ పథకాలను ఎట్టి పరిస్థితుల్లో నిలిపి వేయాలనే ఉద్దేశంతో చేస్తున్న అసత్య ప్రచారాలను జనాలు గమనిస్తున్నారని..
వారికి తగిన బుద్ధి చెప్తారు అంటూ వైకాపా నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో కూడా జరగని సంక్షేమ కార్యక్రమాల అమలు కేవలం ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందని ఆ విషయం తెలుగు దేశం పార్టీ నాయకులకు నచ్చడం లేదంటూ వైకాపా నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పేద ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల విషయంలో వారు చేస్తున్న రాజకీయం ను ప్రతి ఒక్కరు గమనిస్తున్నారని సంక్షేమ పథకాలను నిలిపివేసే సమస్య లేదని, తెలుగు దేశం పార్టీ ఎన్ని కుట్రలు పన్నినా ఖచ్చితంగా అన్ని సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని వైకాపా ముఖ్య నాయకులు ప్రకటించారు.
ప్రజలు తెలుగు దేశం పార్టీ యొక్క వ్యవహారాన్ని చూస్తున్నారని సమయం వచ్చినప్పుడు మరో సారి వారికి బుద్ధి చెప్పి వైకాపా పై నమ్మకాన్ని చూపిస్తారంటూ మంత్రి అన్నారు. తెలుగు దేశం పార్టీలో నాయకుల కొరత కనిపిస్తుంది అదే సమయంలో వారి యొక్క అభద్రతాభావంతో ఏకంగా సంక్షేమ పథకాలకు సంబంధించిన ఈ విషయమై ఆందోళనకు దిగడం విడ్డూరంగా ఉంది అంటూ వైకాపా నాయకులు ఎలా చేశారు. ప్రతి ఒక్క పేద ప్రజలకు సంక్షేమ పథకాలను అందజేయడమే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం పని చేస్తుందని ఈ సందర్భంగా వైకాపా ఎమ్మెల్యే నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.