YSRCP : పార్టీ కోసం పని చేసే వారి కోసం వైకాపా ప్రత్యేక స్కీం
YSRCP : ఏపీ అధికార పార్టీ వైకాపా తమ కార్యకర్తల కోసం ప్రత్యేకంగా స్కీం ను మొదలు పెట్టబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. పార్టీ కోసం అనుక్షణం కష్టపడుతున్న ప్రతి ఒక్కరి శ్రేయస్సు కోసం వైకాపా అధినాయకత్వం సంక్షేమ పథకంను తీసుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. దేశంలో ఏ రాజకీయ పార్టీ తమ కార్యకర్తల కోసం ఆలోచించని విధంగా జగన్ ఆలోచించి వారి కోసం పార్టీ నిధి నుండి పెద్ద మొత్తంలో సంక్షేమం కోసం ఖర్చు చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వ మరియు పార్టీ వర్గాల నుండి ఇప్పటికే వైకాపా కార్యకర్తలకు సహాయం అందుతూనే ఉంది.
ఇప్పుడు కార్యకర్తల కోసం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించేందుకు గాను ప్లాన్ చేస్తున్నట్లుగా వైకాపా కీలక నాయకుడు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలతో పాటు ఇతర దేశాల్లో ఉన్న పార్టీ కార్యకర్తల కోసం కూడా సహాయ నిధి ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రత్యేక స్కీం ను ఏర్పాటు చేయడం ద్వారా వైకాపా కార్యకర్తలు పార్టీ కోసం మరింత కష్టపడి పని చేస్తారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటి నుండే ప్రయత్నాలు చేస్తున్న.

YSRCP new scheme for party workers and small leaders
ఏపీ అధికార పార్టీ వైకాపా రాష్ట్ర ప్రజల కోసం ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాలను తీసుకు రావడంతో పాటు పెద్ద ఎత్తున అభివృద్ది కార్యక్రమాలు చేస్తున్నారు. ఇదే సమయంలో పార్టీ కోసం పని చేస్తున్న కార్యకర్తలకు తాము ఉన్నాం అంటూ సాయం చేసేందుకు అనేక స్కీమ్ లను తీసుకు వస్తున్నారు. మొత్తానికి ఈ విషయంలో వైఎస్ జగన్ మరోసారి గొప్ప వ్యక్తిగా నిలిచారు. పార్టీ కార్యకర్తలకు అందించబోతున్న స్కీమ్ లను దేశ వ్యాప్తంగా ఇతర పార్టీలు కూడా ఆదర్శంగా తీసుకునే అవకాశం ఉంది.