వైసీపీకి అప్పుడే ఎదురుగాలి..! జాగ్రత్త జగనన్న..?
తిరుపతి ఉప ఎన్నికల్లో YSRCP విజయం సాధించింది, అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. కానీ…. ఈ ఎన్నికల ఫలితాలు వైసీపీ కి ఆత్మపరిశీలన చేసుకునే అవకాశాన్ని ఇచ్చాయనే చెప్పాలి. మొదటిగా ఈ ఉప ఎన్నికల్లో ఐదు లక్షల మెజారిటీ సాధించాలని జగన్ టార్గెట్ పెట్టినట్లు వార్తలు వచ్చాయి, కానీ చివరికి 2,71,592 ఓట్ల మెజారిటీ దక్కింది. 2019 తో పోల్చి చూస్తే 43,216 ఓట్ల అదనపు మెజారిటీ వచ్చింది.
ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గిందని వైసీపీ నేతలు అంటున్నారు. గతంలో 7.22 లక్షల ఓట్లు వస్తే, ఇప్పుడు 6.26 లక్షల ఓట్లు మాత్రమే వచ్చాయి, అంతే సుమారు ఒక లక్ష ఓట్లు దాక తగ్గాయి. ఆ లక్ష ఓట్లు వైసీపీవే అయినప్పుడు ఆ ఓటర్లని ఎందుకు వైసీపీ నేతలు పోలింగ్ బూత్ దాక తీసుకోని రాలేకపోయారు అనేది ఇక్కడ గమనించాలి.
రాష్ట్రంలో సగం మంత్రులను తిరుపతిలో మోహరించాడు జగన్, దాదాపు డజన్ మంది ఎమ్మెల్యేలు ప్రచారం చేసిన కానీ వైసీపీ ఓట్లు వైసీపీ రాలేదంటే దానిని ఏ కోణంలో చూడాలి. టీడీపీకి కూడా ఓట్లు తగ్గాయి కాదని అనుకోవచ్చు, ఎలాగూ ప్రతిపక్షమే కదా దానిని ఓట్లు వేసిన లాభం లేదనే ఒక నిర్లక్ష్యంతో టీడీపీ ఓటర్లు ఓటింగ్ కి దూరంగా ఉండవచ్చు, అదేమీ సమస్య కాదు. కానీ వైసీపీ పరిస్థితి అలా కాదు..
జగన్ పరిపాలన పట్ల రాష్ట్ర ప్రజలు సానుకూలంగా ఉన్నారని వైసీపీ నేతలు బలంగా చెపుతున్నారు, అదే నిజం అనుకుంటే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పరుగులు పెట్టి వైసీపీకి ఓట్లు వేయాలి కదా..? ఒక్క తిరుపతి నియోజకవర్గంలోనే గతంలో కంటే ఈ సరి వైసీపీ కి 1000 ఓట్లు అధికారంగా వచ్చాయి. మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో ఆరు వేల నుండి 22 వేల వరకు ఓట్లు తగ్గాయి.. ఈ పరిణామం పై వైసీపీ నేతలు ఖచ్చితంగా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందే.. 2019 పొలోమంటూ ఓట్లు వేసిన జనాలు ఇప్పుడు ఎందుకు దూరంగా ఉన్నారు.. జగన్ మీద వ్యతిరేకత వచ్చిందా..? లేక స్థానిక ఎమ్మెల్యేల పనితీరుపై వ్యతిరేకత వచ్చిందా..? అనే దానిపై వైసీపీ పెద్దలు ఒక క్లారిటీకి రావాలి .