
#image_title
Zomato | ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ అనగానే ప్రజలకు ముందుగా గుర్తొచ్చే పేర్లు జొమాటో, స్విగ్గీ. ప్రత్యేకించి పండుగల సీజన్ సమయంలో స్పెషల్ ఆఫర్లు, డిస్కౌంట్లతో వినియోగదారులను ఆకట్టుకుంటూ వచ్చిన ఈ దిగ్గజ ఫుడ్ డెలివరీ యాప్స్ ఇప్పుడు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. తాజాగా జొమాటో తమ ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
#image_title
రూ. 10 నుంచి రూ. 12కి ఫీజు పెంపు
పండుగల సీజన్‌ను టార్గెట్ చేస్తూ, జొమాటో దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న నగరాల్లో ప్రతి ఆర్డర్‌పై ప్లాట్‌ఫామ్ ఫీజును రూ.10 నుంచి రూ.12కి పెంచింది. 2023 ఆగస్టులో ప్రారంభించిన ఈ ఫీజు వ్యవస్థను అప్పట్లో రూ.2గా ప్రవేశపెట్టగా, ఇప్పుడు వరుసగా పెరిగి రూ.12కు చేరింది. కంపెనీ ప్రకారం, ఈ పెంపు అన్ని నగరాల్లోని కస్టమర్లకు వర్తిస్తుంది.
పండుగల సమయంలో ఆర్డర్ల సంఖ్య భారీగా పెరగడం, డెలివరీ బృందానికి అధిక చెల్లింపులు, నిర్వహణ ఖర్చులు పెరగడం వంటి అంశాలు ఈ నిర్ణయానికి దారితీశాయని సమాచారం. మరోవైపు, జొమాటో మాతృసంస్థ ఎటర్నల్‌కు 2024 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో నికర లాభం 90% తగ్గడం కూడా ఈ నిర్ణయంలో ప్రభావం చూపినట్లు అంచనాలు.గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.253 కోట్ల లాభాన్ని ఆర్జించిన కంపెనీ, ఈ ఏడాది అదే కాలంలో కేవలం రూ.25 కోట్ల లాభంతోనే సరిపెట్టుకుంది. ఆదాయం 70% పెరిగినా, నికర లాభం భారీగా తగ్గింది.
.
Black Hair : మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పెరుగుతున్న వర్క్ టెన్షన్స్ కారణంగా ఈ రోజుల్లో చిన్న వయస్సులోనే…
Vegetables And Fruits : మన రోజువారీ ఆహారంలో కూరగాయలు, పండ్లు చాలా ముఖ్యమైనవి. అయితే మనకీ దొరికే ప్రతి…
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Ranabaali Movie : టాలీవుడ్ Tollywood యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ Vijay Devarakonda మరోసారి తన సినిమా ఎంపికతో…
Ambati Rambabu : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో మరోసారి 'రెడ్ బుక్' Red Book అంశం అధికార, ప్రతిపక్షాల…
Indiramma Houses : పేదలకు సొంతింటి కలను నిజం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల…
Amaravati Capital : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత దశాబ్ద కాలంగా 'అమరావతి' ఒక ప్రధాన అంకంగా నిలిచింది. 2014లో విభజన…
Loan: లోన్ తీసుకోవాలంటే ముందుగా మంచి సిబిల్ స్కోర్ cibil score ఉండాలి ఆ తర్వాత బ్యాంకుల Banks చుట్టూ…
This website uses cookies.