Ahmedabad Plane Crash : కుటుంబాన్ని మొత్తం.. 10 మందిని బలిగొన్న అహ్మదాబాద్ విమాన ప్రమాదం..!
ప్రధానాంశాలు:
Ahmedabad Plane Crash : కుటుంబాన్ని మొత్తం.. 10 మందిని బలిగొన్న అహ్మదాబాద్ విమాన ప్రమాదం..!
Ahmedabad Plane Crash : గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటు చేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో రాజస్థాన్‌కు చెందిన పది మంది వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో వృత్తిరీత్యా లండన్‌లో స్థిరపడేందుకు వెళుతున్న ఒక వైద్యుల కుటుంబం కూడా ఉండటం అందరినీ కలచివేస్తోంది. ఈ దుర్ఘటనతో ఆ కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Ahmedabad Plane Crash : కుటుంబాన్ని మొత్తం.. 10 మందిని బలిగొన్న అహ్మదాబాద్ విమాన ప్రమాదం..!
Ahmedabad Plane Crash : ఘోరాతి ఘోరం..
వివరాల్లోకి వెళితే, డాక్టర్ ప్రతీక్ జోషి, ఆయన భార్య డాక్టర్ కోమి వ్యాస్ తమ ముగ్గురు పిల్లలు మిరాయ, నకుల్, ప్రద్యుత్‌లతో కలిసి లండన్‌లో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ప్రయాణమయ్యారు. వృత్తిపరమైన ఉన్నతి కోసం, పిల్లల భవిష్యత్తు కోసం వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘోర ప్రమాదంలో డాక్టర్ ప్రతీక్ జోషి, డాక్టర్ కోమి వ్యాస్‌లతో పాటు వారి ముగ్గురు పిల్లలూ సంఘటనా స్థలంలోనే మరణించినట్లు అధికారులు ధృవీకరించారు.
ఈ విమాన ప్రమాదంలో వీరి కుటుంబంతో పాటు రాజస్థాన్‌కు చెందిన మరో ఐదుగురు కూడా మృతి చెందారని సమాచారం. ఉన్నతమైన భవిష్యత్తు కోసం కన్న కలలు కళ్ల ముందే ఆవిరైపోవడం, కుటుంబం మొత్తం ఈ ప్రమాదంలో బలికావడం తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. ఈ విమాన ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.