Grandmother : వామ్మో.. 65ఏళ్ల అమ్మమ్మ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న 21 ఏళ్ల మనవడు..!
ప్రధానాంశాలు:
65ఏళ్ల అమ్మమ్మని పెళ్లి చేసుకున్నాడు.. 21ఏళ్ల యువకుడు
ప్రేమకు వయసుతో సంబంధం లేదు అనేదానికి అదే ఉదాహరణ
Grandmother : సాధారణంగా అమ్మమ్మ అంటే ఆత్మీయత, ఆప్యాయతను పంచే వ్యక్తిగా మనం ఊహిస్తాం. తల్లిలాంటి ప్రేమను ఇవ్వగల దయామయురాలిగా చూస్తాం. అయితే హర్యానాలో ఓ విచిత్ర లవ్ స్టోరీ అందరినీ ఆశ్చర్యంలో ముంచింది. 21ఏళ్ల యువకుడు ఇర్ఫాన్ తన 65ఏళ్ల అమ్మమ్మ సుల్తానా ఖటూన్‌ను పెళ్లి చేసుకున్నాడు. తాత మరణానంతరం ఒంటరిగా ఉన్న సుల్తానాకు భావోద్వేగ పరంగా మద్దతు ఇచ్చిన మనవడు… కొన్నాళ్లకే ఆమెను జీవిత భాగస్వామిగా మార్చుకున్నాడు.

Grandmother : వామ్మో.. 65ఏళ్ల అమ్మమ్మ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న 21 ఏళ్ల మనవడు..!
Grandmother : ప్రేమకు వయసుతో సంబంధం లేదు అనేదానికి అదే ఉదాహరణ
తాత చనిపోయిన తర్వాత సుల్తానా ఖటూన్ ఒంటరితనంతో బాధపడుతుండగా, ఆమె మనవడు ఇర్ఫాన్ ఆమెకు మానసికంగా తోడుగా నిలిచాడు. మొదట ఇది కేవలం కుటుంబ అనుబంధంగా ఉన్నా, కాలక్రమంలో అది ప్రేమగా మారింది. ఇద్దరు ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి చేరుకున్నారు. అందుకే వారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుని, సమాజ వ్యతిరేకతను పట్టించుకోకుండా ఒక్కటయ్యారు.
ఈ వివాహం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. వయసులో ఎంతో తేడా ఉన్నా, ఆత్మీయతను ప్రేమగా మలచుకుని జీవితాన్ని కొనసాగిస్తున్న ఈ జంటపై విమర్శలూ, ఆసక్తికర చర్చలూ వెల్లువెత్తుతున్నాయి. కొందరు ఇది అభాసజనకమని తేల్చివేస్తుండగా, మరికొందరు వారి వ్యక్తిగత ఎంపికను గౌరవించాలని అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ, ఈ సంఘటన “సమాజం ఎటుపోతుందో?” అనే ఆందోళనలకు దారి తీస్తోంది.