KCR : గజ్వేల్‌లో కేసీఆర్‌కు షాక్.. పోటీలో 44 మంది.. కేసీఆర్‌కు ఈసారి గెలుపు అంత సులభం కాదా?
ప్రధానాంశాలు:
గజ్వేల్ నుంచి 127 నామినేషన్లు
కేసీఆర్ తో ఈటల రాజేందర్, తూముకుంట నర్సారెడ్డి పోటీ
కేసీఆర్ కు గట్టి పోటీ ఇవ్వనున్నారా?
KCR : గజ్వేల్ అనగానే మనకు ముందు గుర్తొచ్చేది సీఎం కేసీఆర్. ఎందుకంటే.. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం అది. ఆయన ఊరు కూడా గజ్వేల్ నియోజకవర్గంలోనే ఉంది. అందుకే గజ్వేల్ నియోజకవర్గానికి రాష్ట్రంలో చాలా క్రేజ్ ఉంటుంది. ఆ నియోజకవర్గానికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. తన సొంత నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు చాలా సార్లు పోటీ చేసి గెలిచి తన సత్తా చాటారు. గజ్వేల్ లో పోటీ అంటే అక్కడ వార్ వన్ సైడ్ అనే అనుకోవాలి. ఎందుకంటే సీఎం కేసీఆర్ ను కాదని పోటీ చేసినా గెలిచే సత్తా ఎవ్వరికీ లేదు. కేసీఆర్ కు ఉన్న ప్రాబల్యం ముందు మిగితా పార్టీల అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవు. ఏదో గెలవడం కాదు.. అత్యంత భారీ మెజారిటీతో సీఎం కేసీఆర్ గజ్వేల్ లో గెలిచి ఇప్పటి వరకు తన సత్తా చాటుతూ వచ్చారు. అయితే.. ఈ సారి ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ కు షాక్ తగిలిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే.. ఈసారి గజ్వేల్ నియోజకవర్గం నుంచి 44 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్.. ఈ నాలుగు నియోజకవర్గాల్లో 95 మంది అభ్యర్థులు నిలిచారు. నాలుగు నియోజకవర్గాలకు కలిపి మొత్తం 213 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా 105 మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. సిద్దిపేట జిల్లాలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని కూడా ముమ్మరం చేశారు. నియోజకవర్గంలో ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో రికార్డు స్థాయిలో నామినేషన్లు మాత్రం దాఖలు చేశారు. సిద్దిపేటలో 37 మంది నామినేషన్లు వేశారు. అందులో 16 మంది విత్ డ్రా చేసుకున్నారు. బీఆర్ఎస్ నుంచి హరీశ్ రావు, కాంగ్రెస్ నుంచి పూజ్యుల హరికృష్ణ, బీజేపీ నుంచి దూది శ్రీకాంత్ రెడ్డి పోటీ పడుతున్నారు.
KCR : గజ్వేల్ లో కేసీఆర్ కు వ్యతిరేకంగా ఈటల
సీఎం కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గంలో గట్టి పోటీ నెలకొన్నది. గజ్వేల్ లో 127 మంది నామినేషన్లు వేయగా ఉపసంహరణ పూర్తయ్యే సరికి 70 మంది విత్ డ్రా చేసుకున్నారు. దీంతో గజ్వేల్ నుంచి 44 మంది పోటీ పడుతున్నారు. కేసీఆర్ తో ఈటల రాజేందర్, తూముకుంట నర్సారెడ్డి పోటీ పడుతున్నారు. అలాగే.. దుబ్బాక నుంచి 11 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బీజేపీ నుంచి రఘునందన్ రావు, బీఆర్ఎస్ నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి మధ్య ప్రధానంగా పోటీ జరగనుంది.