Air India Flight : ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు, ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
ప్రధానాంశాలు:
Air India Flight :ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు, ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Air India Flight : థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానానికి (AI-379) శుక్రవారం బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపింది. విమానం గాల్లో ప్రయాణిస్తుండగానే అధికారులు బెదిరింపు మెయిల్‌ను గుర్తించారు. వెంటనే ఎయిర్‌పోర్ట్ అథారిటీ సూచనల మేరకు పైలట్ విమానాన్ని అండమాన్ సముద్ర ప్రాంతంలో తిప్పుతూ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు సిద్ధమయ్యారు. చివరికి ఫుకెట్ విమానాశ్రయంలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ఆ సమయంలో విమానంలో 156 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారిక సమాచారం.

Air India Flight : ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు, ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Air India Flight : మరోసారి ప్రయాణికులను ఖంగారు పెట్టించిన ఎయిర్ ఇండియా
ఫ్లైట్‌రాడార్24 ప్రకారం.. విమానం ఫుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఉదయం 9:30 గంటలకు ఢిల్లీ ప్రయాణానికి బయలుదేరింది. కానీ 20 నిమిషాలకే అండమాన్ సముద్రం చుట్టూ తిరుగుతూ, స్థానిక సమయం ప్రకారం ఉదయం 11:38కి మళ్లీ ఫుకెట్‌కు తిరిగి వచ్చి అత్యవసరంగా ల్యాండ్ అయింది. అనంతరం విమానాన్ని అధికారులు పరిశీలించగా, ఎటువంటి పేలుడు పదార్థాలు లభించలేదని వెల్లడించారు. అయితే ఈ బాంబు బెదిరింపుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది.
నిన్న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. లండన్‌కు బయలుదేరిన AI-171 విమానం ప్రయాణం ప్రారంభించిన కొన్ని నిమిషాలకే కూలిపోయింది. ఈ ప్రమాదంలో మొత్తం 265 మంది మరణించారు. ఇందులో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ తో పటు 24 మంది మెడికల్ విద్యార్థులు సహా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు ఘటనలు దేశవ్యాప్తంగా విమాన ప్రయాణ భద్రతపై ఆందోళనను కలిగిస్తున్నాయి.