Air India Crash : ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నుండి బయటపడ్డ వ్యక్తి ఏమంటున్నాడంటే.. వీడియో ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Air India Crash : ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నుండి బయటపడ్డ వ్యక్తి ఏమంటున్నాడంటే.. వీడియో !

 Authored By ramu | The Telugu News | Updated on :13 June 2025,5:00 pm

ప్రధానాంశాలు:

  •  విమాన ప్రమాదం ఎలా జరిగిందో తెలిపిన ప్రయాణికుడు కుమార్

  •  విమాన ప్రమాదం నుండి ఎలా బయటపడ్డాడో తెలిపిన కుమార్

  •  Air India Crash : ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నుండి బయటపడ్డ వ్యక్తి ఏమంటున్నాడంటే.. వీడియో !

Air India Crash : అహ్మదాబాద్ విమాన ప్రమాదం దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఎయిరిండియా విమానం గురువారం మధ్యాహ్నం రన్‌వేపై వేగంగా దూసుకెళ్తూ హాస్టల్ భవనాన్ని ఢీకొనడంతో భారీ విషాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో విమానంలోని 241 మంది దుర్మరణం చెందగా, కేవలం ఒకే ఒకడు విశ్వస్ కుమార్ రమేష్ ప్రాణాలతో బయటపడ్డారు. విమానంలోని ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర 11ఏ సీటులో కూర్చున్న ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు…

Air India Crash ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నుండి బయటపడ్డ వ్యక్తి ఏమంటున్నాడంటే వీడియో

Air India Crash : ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నుండి బయటపడ్డ వ్యక్తి ఏమంటున్నాడంటే.. వీడియో !

Air India Crash విమాన ప్రమాదంలో తనను కాపాడింది అదే అంటూ ఎమోషనల్ కు గురైన విశ్వస్ కుమార్ రమేష్

ఆపదలో నుంచి బయటపడిన విశ్వస్ కుమార్ తాజాగా మీడియాతో మాట్లాడారు. విమానం టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలోే తనకు ఏదో వింతగా అనిపించిందని చెప్పారు. ఒక్కసారిగా లోపల నిశబ్దం ఏర్పడిందని, ఆకుపచ్చ, తెలుపు లైట్లు వెలిగాయని గుర్తు చేశారు. పైలెట్లు పూర్తిగా కాపాడేందుకు ప్రయత్నించినా, విమానం నేరుగా ఓ భవనాన్ని ఢీకొట్టిందని పేర్కొన్నారు. ప్రమాద సమయంలో తన సీటుబెల్ట్ ఊడిపోయి, సీటుతో సహా బయటకు విసిరి పడినట్లు తెలిపారు. తాను చనిపోతానని అనుకున్నానని, కళ్లు తెరిచి చూస్తే బ్రతికే ఉన్నానని ఆయన ఎమోషనల్ గా తెలిపారు.

విమానం ముక్కలైపోవడం, మంటలు చెలరేగిన దృశ్యాలను కుమార్ వర్ణిస్తూ, తన పక్కన ఉన్న ఎయిర్ హోస్టెస్, ఇతర ప్రయాణికులు చనిపోయారని విచారం వ్యక్తం చేశారు. ప్రమాద సమయంలో విమానం నుంచి దూకలేదని, కానీ ఎమర్జెన్సీ డోర్ ఊడిపోవడంతో ఆ మార్గం ద్వారా బయటపడ్డానని చెప్పారు. ఈ సంఘటనలో తన చేతికి గాయమై కాలిపోయినట్టు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదం దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురిచేయగా, విశ్వస్ కుమార్ రమేష్ మృత్యుంజయుడిగా ప్రశంసలందుకుంటున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది