EPFO : పీఎఫ్ దారులు ఈ విష‌యం గ్ర‌హించండి.. ఈపీఎఫ్ఓ చేసిన ఐదు కీల‌క మార్పులు ఏంటంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

EPFO : పీఎఫ్ దారులు ఈ విష‌యం గ్ర‌హించండి.. ఈపీఎఫ్ఓ చేసిన ఐదు కీల‌క మార్పులు ఏంటంటే..!

 Authored By ramu | The Telugu News | Updated on :16 February 2025,8:00 am

ప్రధానాంశాలు:

  •  EPFO : పీఎఫ్ దారులు ఈ విష‌యం గ్ర‌హించండి.. ఈపీఎఫ్ఓ చేసిన ఐదు కీల‌క మార్పులు ఏంటంటే..!

EPFO : ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్ తన ఖాతాదారుల కోసం ఎన్నో సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్న విష‌యం తెలిసిందే. టెక్నాలజీ పెరిగేకొద్ది సులభమైన సేవలు తీసుకువస్తోంది. గతంలో ఏదైనా చిన్న పని ఉన్నాఈపీఎఫ్‌ కార్యాలయానికి వెళ్లాల్సి ఉండేది. కానీ ఇప్పుడు ఇంట్లోనే ఉండి పనులు చేసుకోవచ్చు. జాయింట్ డిక్లరేషన్ ప్రాసెస్ విషయంలో ఈపీఎఫ్ వో కొత్త సర్క్యూలర్ జారీ చేసింది. చందాదారుల సౌలభ్యం కోసం ఈ మార్పు చేసింది. దీని ద్వారా ఎస్ వోపీ వెర్షన్ 3.0 ప్రతిపాదనల్లో కొన్నింటిని మార్చడం సులభతరమవుతుంది.

EPFO పీఎఫ్ దారులు ఈ విష‌యం గ్ర‌హించండి ఈపీఎఫ్ఓ చేసిన ఐదు కీల‌క మార్పులు ఏంటంటే

EPFO : పీఎఫ్ దారులు ఈ విష‌యం గ్ర‌హించండి.. ఈపీఎఫ్ఓ చేసిన ఐదు కీల‌క మార్పులు ఏంటంటే..!

EPFO ఇవే మార్పులు..

సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ స్కీమ్ (సీపీపీఎస్)ను 2025 జనవరి ఒకటి నుంచి అందుబాటులోకి తీసుకువచ్చింది. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పెన్షన్ ఇవ్వనుంది. దీని ద్వారా దేశంలోని ఏ బ్యాంకు నుంచైనా పెన్షన్ తీసుకునే అవకాశం కల్పించింది. తద్వారా ఇకపై పెన్షన్ పేమెంట్ ఆర్డర్ల అవసరం ఉండదు. ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) కింద అధిక సంపాదన పొందుతున్న వ్యక్తుల పెన్షన్ కేసుల ప్రాసెసింగ్ విధానాలను వివరిస్తూ ఈపీఎఫ్ వో కొత్త సర్క్యూలర్ విడుదల చేసింది. అధిక వేతనాలపై పెన్షన్ (పీవోహెచ్ డబ్ల్యూ) కేసులకు సంబంధించిన కొన్ని సమస్యలపై క్షేత్ర కార్యాలయాలు ప్రశ్నలు లేవనెత్తాయి. వీటి పరిష్కారానికి కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపించారు.

ఈపీఎఫ్ అకౌంట్ అప్ డేటేషన్ సులభతరమైంది. తమ యూనివర్సల్ అకౌంట్ నంబర్ ను ఇప్పటికే ఆధార్ ద్వారా వెరిఫై చేయించుకున్న వారు ఎలాంటి సపోర్టింగ్ డాక్యుమెంట్లు లేకుండానే పుట్టిన తేదీ, జెండర్, జాతీయత, తల్లిదండ్రుల పేరు, వివాహ స్థితి, జీవిత భాగస్వామి పేరు, జాయినింగ్ తేదీ, ఉద్యోగం వీడిన తేదీ మార్చుకోవచ్చు. అయితే 2017 అక్టోబర్ ఒకటికి ముందు యూఏఎన్ ఉన్న వారికి నిబంధనలు వేరుగా ఉంటాయి. పీఎఫ్ అకౌంట్ ట్రాన్స్ ఫర్.. ఉద్యోగం మారినప్పుడు పీఎఫ్ ట్రాన్స్ ఫర్ చేసుకునే ప్రక్రియను తాజాగా సులభతరం చేశారు. కంపెనీల యాజమాన్యాల ఆమోదం లేకుండానే ఆన్ లైన్ లో తమ ఖాతాను బదిలీ చేసుకోవచ్చు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది