Ambati Rambabu : రేయ్ ఆంబోతు సిగ్గూశరం ఉందా? మూసుకొని దెం**యండ్రా.. అసెంబ్లీలో డ్యాన్స్ స్టెప్పులు వేసి ఇమిటేట్ చేసిన అంబటి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ambati Rambabu : రేయ్ ఆంబోతు సిగ్గూశరం ఉందా? మూసుకొని దెం**యండ్రా.. అసెంబ్లీలో డ్యాన్స్ స్టెప్పులు వేసి ఇమిటేట్ చేసిన అంబటి

 Authored By kranthi | The Telugu News | Updated on :24 September 2023,6:00 pm

Ambati Rambabu : ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు చేసే రచ్చకు వైసీపీ సభ్యులకు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. సభను నడవనీయకుండా అడ్డుకోవడం కోసం టీడీపీ నేతలు తెగ ప్లాన్లు వేస్తున్నారు. అందుకే కొందరు సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. మొత్తం ఉన్నది 23 మంది ఎమ్మెల్యేలు. అందులో అసెంబ్లీకి వచ్చేదే కొందరు. అందులో కొందరిని స్పీకర్ సస్పెండ్ చేశారు. ఉన్నవాళ్లు కూడా చంద్రబాబు అరెస్ట్ పై ఎలా స్పందించాలో కూడా తెలియక అసెంబ్లీలో పరువు పోగొట్టుకున్నారు. టీడీపీ సభ్యుల రచ్చపై అంబటి రాంబాబు కూడా స్పందించారు.

ambati rambabu fires on balakrishna and atcham naidu in ap assembly

#image_title

వీళ్లు ఉన్నదే మొత్తం 23 మంది. కానీ లెక్కేస్తే 11 మంది కూడా లేరు. మిగితా వాళ్లు ఏమైపోయారు అధ్యక్షా. అచ్చెంనాయుడు గారిని ముగ్గురిగా లెక్కేయొచ్చు. అది వేరే విషయం. మీకే చిత్తశుద్ధి లేదు. ఆందోళన చేయడానికి కూడా కలిసి రావడం లేదు. మీరు వచ్చి వాళ్లు ఇక్కడ భీంకాలు పలికే పరిస్థితి చేస్తున్నారు. మీరేంటో నాకు అర్థం కాలేదు. మా మిత్రుడు రవి ఉన్నాడు. మా పార్టీలోనే ఉన్నాడు. ఆ తర్వాత ఆ పార్టీలోకి వెళ్లాడు. ఈయన కాగితాలు తీసుకెళ్లి ఆ రామకృష్ణకు ఇస్తే.. ఆయన ఆ కాగితాలు చించి పైకి విసురుతున్నాడు. ఏం చీప్ ఎత్తుగడలు. ఇంత ఛీప్ గా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు. మీరు వెళ్లదలుచుకుంటే వెళ్లండి సామీ. మాచేత ఎందుకు బహిష్కరించబడాలని అనుకుంటున్నారు. సిగ్గనిపించడం లేదా? అంటూ అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు.

Ambati Rambabu : కాగితాలు చించి స్పీకర్ మీద వేస్తారా?

కాగితాలు చించి స్పీకర్ మీద వేసి అది లైవ్ లో రావాలని ఎందుకు చీప్ ట్రిక్స్ పాటిస్తారు. ఈ చీప్ గా ఇంత న్యూసెన్స్ గా ఎందుకు చేస్తున్నారయ్యా.. మీకో దండం పెడతాం వెళ్లండయ్యా బాబు బయటికి. లేకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేయాలి. మా చేత ఎందుకు సస్పెండ్ చేయించుకుంటారు. గౌరవమైనటువంటి ప్రతినిధులు సిగ్గూశరంతో వ్యవహరిస్తే మంచిది. అచ్చెంనాయుడు కింద కూర్చొంటాడు. ఆయన పైకి ఎక్కితే ప్రమాదం అనుకున్నాడో ఏమో.. మిమ్మల్ని పైకి పంపిస్తాడు. అయ్యా మీరు పెద్దవారు.. బుచ్చయ్య చౌదరి గారు.. మీరు కూడా చీప్ గా ఎందుకండి బిహేవ్ చేస్తున్నారు. రాజ్యాంగం లేదు ఏం లేదు. ఆయన్నడగండి.. పార్టీ లేదు ఏదీ లేదు అని ఆయన అన్నాడు. రాజ్యాంగం గురించి చంద్రబాబు మాట్లాడుతారు. రాజ్యాంగాన్ని కూనీ చేసినటువంటి మొదటి వ్యక్తి చంద్రబాబు. మీ పచ్చ కాగితాలు చూపించుకోవడానికి ఇక్కడే దొరికిందా? అయ్యా మీకో దండం. బయలుదేరి వెళ్లండి.. అంతే తప్ప మమ్మల్ని సస్పెండ్ చేస్తే తప్ప వెళ్లం అనేటువంటి ఒక చీప్ ఎత్తుగడలకు ఎందుకు దిగజారిపోతారు.. ఇప్పటికైనా ఆలోచించి మీరు బైకాట్ చేసి వెళ్లండి.. సభ జరుగుతోంది. లేదంటే మీకు సస్పెండ్ చేయాలి. ఆ సస్పెండ్ చేయడం తప్ప మరో మార్గం లేదు.. ఇది దుర్మార్గం అంటూ అంబటి మండిపడ్డారు.

Advertisement
WhatsApp Group Join Now

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది