Ambati Rambabu : అంబటి రాంబాబు ఓడిపోయేవాడే.. పవన్ కల్యాణ్‌ వల్లే గెలుస్తున్నాడు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ambati Rambabu : అంబటి రాంబాబు ఓడిపోయేవాడే.. పవన్ కల్యాణ్‌ వల్లే గెలుస్తున్నాడు..!

 Authored By ramu | The Telugu News | Updated on :18 May 2024,10:30 am

Ambati Rambabu : ఏపీ రాజకీయాల్లో అంబటి రాంబాబు గత ఐదేళ్లుగా హాట్ టాపిక్ గానే ఉంటున్నారు. ఎందుకంటే ఆయన ప్రతిపక్ష పార్టీలపై చేస్తున్న కామెంట్లు ఆ రేంజ్ లోనే ఉంటున్నాయి. మరీ ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ మీద ఆయన చేస్తున్న కామెంట్లు వినడానికి కూడా కొన్ని సార్లు ఇబ్బందికరంగానే అనిపించేవి. ఇక అంబటి రాంబాబును కూడా టీడీపీ, జనసేన పార్టీలు ఆ రేంజ్ లోనే టార్గెట్ చేశాయి. ఎన్నో సార్లు అంబటి రాంబాబుపై ఓ రేంజ్ లో ట్రోల్స్ వచ్చాయి. ఇక అప్పట్లో ఓ అమ్మాయితో ఆయన మాట్లాడాడు అంటూ ఓ ఆడియో బాగా వైరల్ అయిపోయింది.దానిపై ఇప్పటి వరకు రాంబాబు ఎన్నో సార్లు స్పందించారు. అయితే ఇలా ఎప్పటికప్పుడు వివాదాల్లో నిలుస్తున్న రాబాబు సత్తెనపల్లిలో ఓడిపోతాడనే టాక్ బాగా నడిచింది.

Ambati Rambabu రాంబాబుకు ఎదురు గాలులు..

దాన్ని జీవీఎల్ ఎన్ చార్యులు కూడా పలుమార్లు చెప్పుకొచ్చారు. ఆ నియోజకవర్గంలో రాంబాబుకు ఎదురు గాలులు వీస్తున్నాయని.. ఆయన ఓడిపోబోతున్నారంటూ చెప్పుకొచ్చారు. దాంతో అదంతా నిజమే కావచ్చు అని అంతా అనుకున్నారు. కాగా తాజాగా ఆయన మళ్లీ మాట్లాడుతూ సంచలన కామెంట్లు చేశారు. వాస్తవానికి అంబటి రాంబాబు ఓడిపోయేవాడే.. కానీ పవన్ కల్యాన్‌ వల్లే గెలుస్తున్నాడంటూ తెలిపారు.అంబటి రాంబాబు మీద పొన్నూరులో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన గెలుపుకు కారణం అవుతున్నాయన్నారు. చాలా రోజుల తర్వాత రాంబాబు మీద పవన్ కల్యాణ్‌ చాలా ఘాటైన విమర్శలు చేశారని.. అందులో వాస్తవాలు చాలా తక్కువగా ఉన్నాయన్నారు.

Ambati Rambabu అంబటి రాంబాబు ఓడిపోయేవాడే పవన్ కల్యాణ్‌ వల్లే గెలుస్తున్నాడు

Ambati Rambabu : అంబటి రాంబాబు ఓడిపోయేవాడే.. పవన్ కల్యాణ్‌ వల్లే గెలుస్తున్నాడు..!

అవే ప్రభావం చూపించాయని.. పవన్ చేసిన వ్యాఖ్యలను తన గెలుపు కోసం వాడుకోవడంలో అంబటి రాంబాబు బాగానే సక్సెస్ అయ్యాడంటూ చెప్పారు ఆచార్యులు. రాంబాబు డ్యాన్సులు వేస్తున్నాడు తప్ప మంత్రి పదవిని సక్రమంగా నిర్వహించట్లేదని పవన్ కల్యాణ్‌ విమర్శించాడు కాబట్టే అవి కాస్తా జనాల్లోకి బలంగానే వెళ్లినట్టు జీవీఎల్ ఎన్ ఆచార్యులు తెలిపారు. ఇప్పుడు పవన్ కల్యాన్‌ అలాంటి వ్యాఖ్యలు చేసి మరీ దగ్గరుండి రాంబాబును గెలిపించబోతున్నారని తెలిపారు ఆచార్యులు. మరి జూన్ 4న ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది