
Amit Shah : ఏపీలో అమిత్ షా బిజీ షెడ్యూల్.. చంద్రబాబు, పవన్‌ల దగ్గర వైఎస్ ప్రస్థావన తెచ్చిన కేంద్ర హోంమంత్రి
Amit Shah : కేంద్ర హోం మంత్రి అమిత్ షా Amit Shah పర్యటన ఏపీలో బిజీ బిజీగా నడుస్తుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు Chandra Babu Naidu శనివారం రాత్రి తన నివానంలో విందు ఏర్పాటు చేశారు. ఏసీ సీఎం ఇచ్చిన విందుకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ Bandi Sanjay, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ Pawan Kalyan , లోకేశ్ Nara Lokesh సహా మంత్రులు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తదితరులు పాల్గొన్నారు. . విశాఖ ఉక్కుకు కేంద్రం బారీ ప్యాకేజీ ప్రకటించిన మరునాడే అమిత్ షా ఏపికి రావడంతో అటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా ఇటు రాష్ట్ర ప్రజలు కూడా షా టూర్ పై హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే విశాఖ ఉక్కు తెలుగు ప్రజల మనోభావాలతో ముడిపడిన అంశమని తమకు తెలుసున్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకునే ప్యాకేజీని ప్రకటించామని అన్నారు…
Amit Shah : ఏపీలో అమిత్ షా బిజీ షెడ్యూల్.. చంద్రబాబు, పవన్‌ల దగ్గర వైఎస్ ప్రస్థావన తెచ్చిన కేంద్ర హోంమంత్రి
ఎన్టీఆర్‌కు Sr Ntr భారతరత్న ఇవ్వాలని కోరిన చంద్రబాబు Chandrababu .. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు Congress వ్యతిరేకంగా భావసారూప్యత గల పార్టీలను ఆయన ఒక్కతాటిపైకి తీసుకొచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఎన్టీఆర్ SR NTR కు భారతరత్న కోరుతూ కేంద్రానికి వినతిపత్రం అందజేశామని ఎంపీ పురందేశ్వరి గుర్తుచేశారు. దీనిపై అమిత్ షా సానుకూలంగా స్పందించారు. ఎన్టీఆర్ గొప్ప నేతని, భారతరత్నకు ఆయన అన్నివిధాలా అర్హులని వ్యాఖ్యానించారు. కాగా, విందులో పలు అంశాలపై ఆసక్తికర చర్చ జరిగింది. అంతరాష్ట్ర నదీ జలాల వివాదాల గురించి కూడా కేంద్ర హోం మంత్రి ఆరా తీశారు. భూముల ధరల గురించి ప్రస్తావన రాగా..‘ ఒకప్పుడు ఆంధ్రా ప్రాంతంలో ఎకరం అమ్మితే హైదరాబాద్‌లో ఐదు ఎకరాలు వచ్చేది… ఇప్పుడు అక్కడ ఒక ఎకరం అమ్మితే.. ఇక్కడ యాభై ఎకరాలు కొనొచ్చు’ అని చంద్రబాబు చెప్పారు.
నాడు కాంగ్రెస్ పార్టీ నిత్యం సీఎంలను మారుస్తూ సాగిన వైనాన్ని ప్రస్తావించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తరఫున అత్యధిక కాలం సీఎంగా పనిచేసింది ఎవరు? అంటూ షా ఆరా తీశారు. దీంతో ఏమాత్రం తడుముకోని చంద్రబాబు… దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డేనని తెలిపారు. వైఎస్ Ys Rajashekar reddy ఏకంగా ఆరేళ్లపాటు సీఎంగా పనిచేశారని చంద్రబాబు గుర్తు చేశారు. కాసు బ్రహ్మానందరెడ్డి కూడా ఒకింత ఎక్కువ కాలమే సీఎంగా పనిచేశారని తెలిపారు. ఈ భేటిలో వైఎస్ ప్రస్తావన రావడం చర్చనీయాంశంగా మారింది. విందు భేటీలో అమిత్‌షా జగన్ ప్యాలెస్‌ల గురించి అడిగి మరీ తెలుసుకున్నట్లు సమాచారం. ఇడుపులపాయ, బెంగళూరు ఎలహంక, హైదరాబాద్ లోటస్‌పాండ్, తాడేపల్లిలో ప్యాలెస్‌లు ఉన్నాయని లోకేశ్ అమిత్‌షాకు వివరించారు. ఒక్కొక్కటి ఎన్ని ఎకరాలు ఉండొచ్చని అడగ్గా హైదరాబాద్, తాడేపల్లి ప్యాలెస్‌లో పది ఎకరాల్లోపు ఉంటాయని లోకేశ్ Nara Lokesh బదులిచ్చారు
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.