జగన్ భారీ షాక్ ఇచ్చేదిశగా ఆనం అడుగులు
నెల్లూరు జిల్లాలో కీలక నేతైనా ఆనం రామనారాయణరెడ్డి ప్రస్తుతం వైసీపీ తరుపున వేంకటగిరి నుండి ఎమ్మెల్యే గా ప్రాతినిత్యం వహిస్తున్నాడు. కాంగ్రెస్ హయాంలో పదేళ్లు మంత్రి గా వ్యవహరించిన ఆనం రామనారాయణరెడ్డికి వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన కొత్తల్లో మంత్రి పదవి ఖాయమని అనుకున్నారు, కానీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రం అందుకు భిన్నంగా అదే జిల్లాకు చెందిన ఇద్దరు యువ నేతలకు మంత్రి పదవులు ఇచ్చి, ఆనం ను దూరం పెట్టాడు..
పార్టీకి దూరంగా ?
అప్పటి నుండి కొంచం అసంతృప్తిగా ఆనం రామనారాయణ రెడ్డి, పార్టీ తరుపున పెద్దగా యాక్టీవ్ గా ఉండటం లేదు.. ప్రత్యేకంగా సొంత పార్టీ మీద విమర్శలు చేయకపోయినా కానీ అధికారుల మీద, జిల్లా లోని సొంత పార్టీ నేతల మీద అడపాదప ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో ఒకసారి షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వటానికి వైసీపీ అధినాయకత్వం మొగ్గుచూపటంతో, ఆనం ఏకంగా సీఎం జగన్ ని కలిశాడు. దీనితో షోకాజ్ నోటీసు వ్యవహారం వెనక్కి వెళ్ళింది.
అయితే ప్రస్తుతం ఆనం రాజకీయంగా ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. మరో ఆరు నెలల్లో మంత్రి వర్గ విస్తరణ జరగబోతుంది. ఈ ధపా తనకు మంత్రి పదవి రాకపోతే ఇక వైసీపీ నుండి బయటకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ఆరు నెలలే నా రాజకీయ భవిష్యత్తు ను నిర్ణహించబోతుంది అంటూ ఆనం తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.
పట్టున్న నేత
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పనిచేసిన ఆనం ఆ తర్వాత టీడీపీలోకి చేరాడు. అక్కడ సరైన ఆదరణ లభించకపోవటంతో 2019 ఎన్నికలకు ముందు వైసీపీ తీర్థం పుచుకున్నాడు. తనకు ఎంతో పట్టున్న ఆత్మకూరు కాకుండా, వెంకటగిరి నుండి పోటీకి దించాడు జగన్. అయినా కానీ తనకున్న పట్టుతో అక్కడ విజయం సాధించాడు, నెల్లూరు జిల్లాలో దాదాపు నాలుగు నియోజకవర్గాల్లో గట్టి పట్టున్న ఆనం ఫ్యామిలీ మంత్రి పదవి అనేది లేకపోవటం అవమానకరమే అని అంటున్నారు.. ఆనం మనస్సులో కూడా ఇదే ఉందని, రాజకీయంగా తమ కుటుంబాన్ని దెబ్బ తీయాలనే ఆలోచన చేస్తున్నారంటూ ఆయన ఇటీవలి కాలంలో నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు .. ఈ ధపా మాత్రం మంత్రి పదవి దక్కకపోతే మాత్రం జగన్ కు ఝలక్ ఇవ్వటానికి ఆనం సిద్దమవుతున్నాడు అనే మాటలు వినిపిస్తున్నాయి.