YCP : వైసీపీలో ఆ 15 మంది ఎమ్మెల్యేలకి టెన్షన్ టెన్షన్.. చెమటలు పట్టేస్తున్నాయి..!
YCP : ఏపీలో ఎన్నికలకు ఇంకా ఒక సంవత్సరం సమయం ఉంది. కానీ.. ఇప్పటి నుంచే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో తమకు మళ్లీ టికెట్ వస్తుందా? రాదా? అని అన్ని పార్టీల ఎమ్మెల్యేలు టెన్షన్ తో ఉన్నారు. దానికి కారణం ప్రతి పార్టీ.. ఆ ఎమ్మెల్యే పనితీరుపై క్షేత్రస్థాయిలో రిపోర్ట్ ను తయారు చేయడం. ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలపై రివ్యూ చేస్తున్నారు. జగన్ రివ్యూ చేస్తున్న సంగతి ఎమ్మెల్యేలకు కూడా తెలుసు. కాకపోతే ఆ రివ్యూ లా ఉంటుంది అనేది తెలియక
టెన్షన్ పడుతున్నారు ఎమ్మెల్యేలు. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొని సీఎం జగన్ ప్రక్షాళన దిశగా కీలక అడుగులు వేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే.. ఎమ్మెల్యేలు, ఎంపీలతో నిర్వహించే రివ్యూలో ప్రతి ఎమ్మెల్యే, పీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ను పరిశీలిస్తారని తెలుస్తోంది. ఇందులో కొందరు ఎమ్మెల్యేలకు క్లాసులు పీకే అవకాశం ఉంది. మరికొందరు ఎమ్మెల్యేలకు సలహాలు ఇచ్చి నియోజకవర్గంలో ఇంకా మెరుగ్గా ఉండాలని జగన్ సూచించే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై కూడా విశ్లేషణ ఉంటుందని తెలుస్తోంది.
YCP : ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై కూడా విశ్లేషణ
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. వైసీపీ ఓటమికి గల కారణాలను ఈ సమావేశంలో సీఎం జగన్ చర్చించనున్నారు. వచ్చే సంవత్సరమే ఎన్నికలు ఉండటంతో వచ్చే ఎన్నికలకు ఎలాంటి వ్యూహాలు రచించాలి. ప్రతి గ్రామంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించాలని సీఎం జగన్ యోచిస్తున్నారట. జగన్ తీసుకోబోయే నిర్ణయాలు, ఎమ్మెల్యేల రిపోర్టుపై కూడా ఉత్కంఠ నెలకొన్నట్టు తెలుస్తోంది. జగన్ నిర్వహించిన సర్వే ప్రకారం.. మొత్తంగా జగన్ ఓ 15 మంది ఎమ్మెల్యేల రిపోర్ట్ ను పరిశీలించినట్టు, వాళ్లపై సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో?