Eluru : బడేటి బుజ్జి వర్సెస్ ఆళ్ల నాని.. ఏలూరు గడ్డపై ఎగిరే జెండా ఏది..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Eluru : బడేటి బుజ్జి వర్సెస్ ఆళ్ల నాని.. ఏలూరు గడ్డపై ఎగిరే జెండా ఏది..?

Eluru : ఏలూరు రాజకీయాలు ఎప్పుడూ విభిన్నంగానే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ప్రతిసారి వైఎస్ కుటుంబ సన్నిహితులతో పాటు అటు చంద్రబాబు సన్నిహితుల మధ్యనే పోరు ఉంటుంది. వాస్తవానికి ఇది చాలా పెద్ద నియోజకవర్గం. పేరుకే కార్పొరేషన్ కానీ.. పెద్దగా డెవలప్ మెంట్ జరిగింది ఏమీ లేదు. అయినా సరే ఇక్కడి సామాజిక బలాలే గెలుపును శాసిస్తున్నాయి. ఈ సారి వైసీపీ నుంచి మాజీ మంత్రి సీనియర్ నేత ఆళ్ల నాని బరిలో ఉన్నారు. అటు టీడీపీ […]

 Authored By ramu | The Telugu News | Updated on :29 May 2024,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Eluru : బడేటి బుజ్జి వర్సెస్ ఆళ్ల నాని.. ఏలూరు గడ్డపై ఎగిరే జెండా ఏది..?

Eluru : ఏలూరు రాజకీయాలు ఎప్పుడూ విభిన్నంగానే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ప్రతిసారి వైఎస్ కుటుంబ సన్నిహితులతో పాటు అటు చంద్రబాబు సన్నిహితుల మధ్యనే పోరు ఉంటుంది. వాస్తవానికి ఇది చాలా పెద్ద నియోజకవర్గం. పేరుకే కార్పొరేషన్ కానీ.. పెద్దగా డెవలప్ మెంట్ జరిగింది ఏమీ లేదు. అయినా సరే ఇక్కడి సామాజిక బలాలే గెలుపును శాసిస్తున్నాయి. ఈ సారి వైసీపీ నుంచి మాజీ మంత్రి సీనియర్ నేత ఆళ్ల నాని బరిలో ఉన్నారు. అటు టీడీపీ కూటమి అభ్యర్థిగా బడేటి బుజ్జి తమ్ముడు రాధాకృష్ణ బరిలో నిలబడ్డారు. వీరిద్దరూ గట్టిగానే ఈ సారి ప్రచారం చేశారు.

Eluru : సీనియర్ అసంతృప్తి..

ఇక్కడి నుంచి 2004, 2009లో వైఎస్ రాజశేఖర్ అండతో కాంగ్రెస్ నుంచి ఆళ్ల నాని ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2014 ఎన్నికల్లో మాత్రం బడేటి బుజ్జి 20వేల ఓట్లతో గెలిచారు. మళ్లీ 2019లో ఆళ్ల నాని 4వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈ సారి 2లక్షల 35వేల ఓట్లు ఉండగా.. 70.17 శాతం ఓటింగ్ నమోదైంది. ఈసారి పోలింగ్ కాస్త తగ్గింది. కానీ ఎవరు గెలుస్తారనే ప్రచారం మాత్రం విస్తృతంగా జరుగుతోంది. నియోజకవర్గంలో ఉన్న చాలాపెండింగ్ సమస్యలు ఆళ్ల నానికి వ్యతిరేకంగా మారాయి. అంతే కాకుండా పార్టీ సీనియర్లు ఆయనపై చాలా అసంతృప్తితో ఉన్నారు. వారంతా ఎన్నికల్లో సహకరించలేదు. కానీ జగన్ చరిష్మా తనను గెలిపిస్తుందని ఆయన నమ్ముతున్నారు. అంతే కాకుండా చివరి సమయంలో టీడీపీ కూటమి నుంచి కొంత మంది కీలక లోకల్ లీడర్లు రావడం తనకు కలిసి వచ్చిందని ఆయన భావిస్తున్నారు. కానీ అటు టీడీపీ కూటమి అభ్యర్థి రాధాకృష్ణ మాత్రం తనదే గెలుపు అంటున్నారు.

Eluru బడేటి బుజ్జి వర్సెస్ ఆళ్ల నాని ఏలూరు గడ్డపై ఎగిరే జెండా ఏది

Eluru : బడేటి బుజ్జి వర్సెస్ ఆళ్ల నాని.. ఏలూరు గడ్డపై ఎగిరే జెండా ఏది..?

ఎందుకంటే వైసీపీ నుంచి కీలక లీడర్లు టీడీపీలోకి వెళ్లి ఆయనకు మద్దతు తెలిపారు. జనసేన నేతలు కూడా అండగా కలిసి వచ్చారు. అందరినీ కలుపుకుని పోవడంలో రాధాకృష్ణ సక్సెస్ అయ్యారు. అంతే కాకుండా కేడర్ రాధాకృష్ణకు బలమైన అండగా ఉన్నారు. వారంతా కలిసి రాధాకృష్ణ గెలుపును డిసైడ్ చేస్తున్నారని అంటున్నారు. మరి ఏలూరులో సీనియర్ నేత గెలుస్తాడా లేదంటే జూనియర్ గెలుస్తాడా అనేది చూడాలి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది