Barrelakka Shirisha : ఛీ.. అమ్మాయి అని కూడా చూడకుండా.. వెక్కి వెక్కి ఏడ్చుకుంటూ అసలు నిజాలన్నీ చెప్పేసిన బర్రెలక్క శిరీష
ప్రధానాంశాలు:
నేను బర్రెలు కాసుకుంటున్నా అని వీడియో పెడితే కేసు పెట్టారు
ఉన్న బర్రెలు అమ్ముకొని పట్నం పోతే పరీక్ష పేపర్లు అమ్ముకున్నరు
సామాన్యురాలిగా ఉంటే నన్ను ఎవ్వరూ పట్టించుకోరు
Barrelakka Shirisha : బర్రెలక్క శిరీష్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తను ఇప్పుడు పెద్ద సెలబ్రిటీ అయిపోయింది తెలంగాణలో. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి శిరీష స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో శిరీషపై చాలామంది రాజకీయ నాయకులు ఒత్తిడి తీసుకొచ్చారని, నామినేషన్ ఉపసంహరించుకోవాలని చెప్పారని శిరీష చెప్పుకొచ్చారు. ఆ తర్వాత తను ప్రచారం మొదలుపెట్టగా తనకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. దీంతో తను ప్రచారానికి వెళ్లి వస్తుండగా తన తమ్ముడిపై రౌడీలు దాడి చేశారు. తన తమ్ముడిని చితకబాదారు. అయినప్పటికీ శిరీష వెనుకడుగు వేయలేదు. పోటీ నుంచి తప్పుకునేది లేదని సవాల్ విసిరింది. తాజాగా ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. తనకు కోట్ల రూపాయలు ఆఫర్ చేశారని చెప్పుకొచ్చింది. నా వయసు 25 ఏళ్లు. చిన్న వయసులో ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నా అంటే ఒక్కసారి ఆలోచించండి. నేను ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నానో… ఎన్ని రాళ్ల దెబ్బలు తిన్నానో. నాది డిగ్రీ అయిపోయింది. ఏ నోటిఫికేషన్లు వేయడం లేదు. మా ఇంట్లో అమ్మకు ఆరోగ్యం బాగుండదు. నాకు వెనుక ఇల్లు లేదు.. ఏం లేదు. ఒక చిన్న తడకలో షాపు పెట్టుకొని బతుకుతున్నాం. పెద్ద కొత్తపల్లిలో మసీదుకు ఎదురుగా మా షాపు ఉంటుంది. నేను ఒకటే ఆలోచించుకున్నా.. నాకు మా మమ్మీకి నేను భారం అవ్వొద్దు అని చెప్పి బర్రెలు కొనుక్కొని బతుకుతున్నా. అలా బతుకుతున్న సమయంలో జాబ్స్ రావడం లేదు.. నోటిఫికేషన్స్ వేయడం లేదు. నాకు బాధనిపించింది. దీంతో ఒక వీడియో తీశాను. డిగ్రీలు చదివితే మెమోలు వస్తున్నాయి తప్పితే జాబ్స్ రావడం లేదని నేను బర్రెలు కాసుకుంటున్నా అని ఒకే ఒక్క వీడియో తీస్తే ఆ వీడియోకు నా మీద కేసు పెట్టారు. ఎందుకంటే గవర్నమెంట్ ను నేను విమర్శిస్తున్నా అని కేసు పెట్టారన్నారు.
కరెక్ట్ నోటిఫికేషన్లు వేస్తే నేను ఎందుకు విమర్శిస్తా. మాకు కరెక్ట్ గా జాబ్స్ ఇస్తే నేనెందుకు విమర్శిస్తా. అందులో నేను ఒక్క నాయకుడి పేరు ఎత్తలేదు. ఒక్కరినీ గలీజు మాట తిట్టలేదు. కావాలంటే యూట్యూబ్ లో చూడండి. ఆ వీడియో చాలా వైరల్ అవుతోంది. నేను ఒక్క మాట అనలేదు. నేను జస్ట్ బర్లకు కాసుకొని బతుకుతున్నా. డిగ్రీ చదివి అని చెప్పా. దానికి నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. తర్వాత నోటిఫికేషన్ వచ్చింది. సరే వచ్చింది కదా అని నేను హైదరాబాద్ కు వెళ్లి చదువుకుంటా అని ఉన్న బర్రెలు అమ్మిన. పైసలన్నీ సంచిలో మూటకట్టుకొని హైదరాబాద్ వెళ్లా. మంచి కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయ్యా. కష్టపడి జాబ్ కొట్టాలి. మావోళ్లను మంచిగా చూసుకోవాలని పట్నం పోయా. హాస్టల్ లో ఫుడ్ బాగుండదు. తిని తిని ఒక అరగకపోయేది సరిగ్గా. సున్నం వేసేవాళ్లు అన్నంలో. అయినా సరే నేను ఒకటి సాధించడానికి వచ్చాను.. తిండి మీద కాదు ఉండాల్సింది ధ్యాస చదువు మీద అని చాలా కష్టపడి చదివిన. ప్రతి ఒక్క పరీక్ష పేపర్ అమ్ముకున్నరు. ఇక్కడ ఉన్న నిరుద్యోగులు, ఉద్యోగులు ప్రతి ఒక్కరికి తెలుసు. చాలా పేపర్స్ అమ్ముకున్నరు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, అన్ని పేపర్లు అమ్ముకున్నరు. నాకింక బాధ అనిపించింది. మేము ఇంటికాడ ఉన్న ఉపాధిని కోల్పోయి హైదరాబాద్ వచ్చి ఉపాధి కోసం వస్తే ఉన్న ఉపాధి పోయింది. దసరా పండుగకు రావాలంటే అప్పటి వరకు ఒక జాబ్ వస్తది. మంచిగా కాలర్ ఎగరేసుకొని ఊరిలో తిరగొచ్చు అని అందరూ అనుకున్నారు కానీ.. జాబ్స్ రాలే. ఉన్నవి మొత్తం అమ్ముకున్నారన్నారు.
Barrelakka Shirisha : నామినేషన్ వేయడానికి 5000 కూడా నా దగ్గర లేవు
అప్పుడే నేను ఫిక్స్ అయినా. ఇవన్నీ వెలికి తీయాలి అంటే ఒక సామాన్య మనిషిగా పోతే నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నాతో నామినేషన్ వేయడానికి 5000 కూడా లేవు. మా అత్తమ్మ, మా ఫ్రెండ్స్ ను అడిగి 5000 జమ చేసుకొని కొల్లాపూర్ లో నామినేషన్ వేశా. నామినేషన్ వేసిన మొదటి రోజు.. నన్ను ఎవ్వరూ ఏమనలేదు. ఆ తర్వాత రోజు నుంచి నన్ను భయపెట్టని వాళ్లు లేరు. ప్రతి ఒక్క పార్టీ వాళ్లు ఇంటికి వచ్చారు. నామినేషన్ నువ్వు విత్ డ్రా చేసుకో. ఓట్లు చీలిపోతాయని ఒక అమ్మాయిని అని కూడా చూడకుండా బాధపెట్టారు. మీరు ఏం చేస్తారో చేయండి.. నేను విత్ డ్రా చేసుకోను అని ఒకటే మాట చెప్పా. అయినా సరే.. నీకెంత డబ్బు కావాలో చెప్పు నేను ఇస్తా. నీ ఆర్థిక పరిస్థితిని మేము బాగా చేస్తాం అన్నారు. మారాల్సింది నా ఆర్థిక పరిస్థితి కాదు.. ఎంతో మంది నిరుద్యోగుల పరిస్థితి. పైసలొస్తే.. తీసుకుంటే నా ఒక్కదాని బతుకు మారుతుందేమో. కానీ.. మీ బతుకులు చూడటానికి అడుగేసిన నేను.. ఎలాంటి ప్రలోభాలకు నేను లొంగలేదు. విత్ డ్రా ఆప్షన్ అయిపోయినాక నన్ను ప్రచారం చేసుకోనీయకుండా పర్మిషన్ రానివ్వలేదు. 25 ఏళ్ల అమ్మాయి 70 ఏళ్లు ఉన్న వాళ్లు భయపడ్డారు కదా. ఇప్పటికైనా నాకు బండి పర్మిషన్ లేకుండా చేసినా.. ఏం చేసినా నేను ప్రచారం చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి నా బాధ తెలుసు. కొంత మంది అమ్మలక్కలు ఫోన్లు చూడని వాళ్లు ఉన్నారు. వాళ్లకు నా గుర్తు చెప్పడానికి కూడా నన్ను ప్రచారం చేసుకోనీయడం లేదు అని చాలా బాధపడ్డా. ఒక ఎమ్మెల్యేకు కూడా లేవు.. నా దగ్గర ఇప్పుడు ఉన్నన్ని వాహనాలు. అందరూ నాకు సహాయం చేస్తున్నారు. అందరూ నాకు మద్దతు ఇవ్వడానికి వచ్చారు. వీళ్లకు నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అయినా సరే.. నీతో ఉంటాం అని చెప్పారు. చాలా మద్దతు ఇస్తున్నారు. ఒక నిరుద్యోగి తలుచుకుంటే ఏం జరుగుతుంది అనేది పైన ప్రభుత్వాలు కదిలేలా రావాలన్నారు.