Barrelakka Sirisha : ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తా .. ఆ తర్వాత సీఎంగా చేస్తా – బర్రెలక్క..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Barrelakka Sirisha : ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తా .. ఆ తర్వాత సీఎంగా చేస్తా – బర్రెలక్క..!

 Authored By aruna | The Telugu News | Updated on :26 January 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  Barrelakka Sirisha : ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తా .. ఆ తర్వాత సీఎంగా చేస్తా - బర్రెలక్క..!

Barrelakka Sirisha : తెలంగాణలో బర్రెలక్క పేరు తెలియని వారు ఉండరు. ఏపీలో కూడా ఈమెకు అభిమానులు ఉన్నారు. ఈ మధ్య జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. ఒకే ఒక్క వీడియోతో బర్రెలక్క పాపులర్ అయ్యారు. నిరుద్యోగ సమస్య కారణంగా బర్రెలు కాస్తున్న అని వీడియో చేసి ఓవర్ నైట్ లో పాపులర్ అయ్యారు. దాంతో ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. బర్రెలక్క అసలు పేరు కర్నె శిరీష. డిగ్రీ పూర్తి చేసిన ఆమె ఉద్యోగం దొరక్క బర్రెలు కాస్తుంది. ఇక తన వీడియో పాపులర్ అవడంతో ప్రజల సమస్యలు తీర్చడానికి అసెంబ్లీలో అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ ఎలక్షన్స్ లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.

ఆ సమయంలో బర్రెలకు చాలామంది మద్దతుగా నిలిచారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసి ప్రచారం కూడా ఆమె విస్తృతంగా చేశారు. కొల్లాపూర్ నియోజక వర్గం నుంచి పోటీ చేసిన బర్రెలక్క ఓడిపోయారు. ఆమెకు దాదాపుగా 6000 ఓట్లు పడ్డాయి. కానీ ఆమె క్రేజ్ మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. ఎన్నికలవేళ బర్రెలక్క పేరు మారుమ్రోగిపోతుంది. సోషల్ మీడియాలో లక్షల్లో ఫాలోవర్స్ పెరిగారు. చాలామంది పెద్ద వ్యక్తులు ఆమెకు మద్దతుగా నిలిచారు. ఆమె ధైర్యాన్ని మెచ్చుకున్నారు. ఆర్థికంగాను సహాయం చేశారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బర్రెలక్క ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల కోసం రెడీ అవుతుందని తెలుస్తోంది. గతంలో కూడా ఆమె ఇంటర్వ్యూలో ఎమ్మెల్యేగా గెలవకపోయినా ఎంపీగా పోటీ చేస్తా, ఆ తర్వాత సీఎం గా కూడా పోటీ చేస్తా అని వ్యాఖ్యలు చేశారు.

ఇప్పుడు త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు రాబోతుండడంతో ఆమె ఎంపీగా పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈసారి నాగర్ కర్నూల్ నుండి పోటీకి దిగుతానని బర్రెలక్క తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలు నేర్పిన పాఠాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి ఆచితూచి అడుగు వేస్తానని తెలిపారు. ఒక సామాన్య మహిళ అసెంబ్లీ నియోజకవర్గంలో పాల్గొనడం నిజంగా గ్రేట్ అలాంటిదే బర్రెలక్క మరోసారి ఎంపీగా పోటీ చేయడం ఆమె ధైర్యానికి నిదర్శనం. ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఎంపీగా అయినా సత్తా చాటాలని బర్రెలక్క ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో మరోసారి బర్రెలక్క పేరు మారుమ్రోగిపోతుంది. బర్రెలక్కా మజాకా అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆమెకు మద్దతు నిలుస్తున్నారు.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది