Nara Bhuvaneswari : జైలులో చంద్రబాబు.. నారా భువనేశ్వరి సంచలన నిర్ణయం.. షాక్‌లో బాలయ్య
Nara Bhuvaneswari : ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా చంద్రబాబు అరెస్ట్ గురించే చర్చ నడుస్తోంది. ఆయన అరెస్ట్ పై టీడీపీ నేతలు రోడ్డు మీదికి వచ్చి భగ్గుమంటున్నారు. అసలు ఇప్పటి వరకు రాజకీయాలు అంటే ఏంటో కూడా తెలియని చంద్రబాబు భార్య భువనేశ్వరి, ఆయన కోడలు బ్రాహ్మణి కూడా బయటికి వచ్చి నిరసన తెలుపుతున్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడుతున్నారు. భువనేశ్వరి తన వల్ల అయ్యేవన్నీ చేస్తున్నారు. మహిళలను పిలవడం, వాళ్లతో క్యాండిల్ ర్యాలీ చేయించడం, మోత మోగించడం, నిరాహార దీక్ష.. ఇలా అన్ని రకాలుగా భువనేశ్వరి ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ.. భువనేశ్వరి ఇటీవల రాజమండ్రిలో నిరాహార దీక్ష చేపట్టారు. మరో అడుగు ముందుకేస్తూ ప్రజా క్షేత్రంలోనే తాడోపేడో తేల్చుకునేందుకు భువనేశ్వరి సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.
భువనేశ్వరి బస్సు యాత్ర చేయనున్నట్టు తెలుస్తోంది. కుప్పం నుంచి మేలుకో తెలుగోడా బస్సు యాత్రను నిర్వహించాలని నారా భువనేశ్వరి నిర్ణయించినట్టు తెలుస్తోంది. బస్సు యాత్ర ప్రారంభించవచ్చన్న వార్తల నేపథ్యంలో టీడీపీ నేతలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొందరు టీడీపీ నేతల ఆధ్వర్యంలో ఈ యాత్రను నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ముందుగా కుప్పం నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ యాత్ర నిర్వహించే అవకాశం ఉంది. అలాగే.. భువనేశ్వరి ఆధ్వర్యంలో బహిరంగ సభను కూడా నిర్వహించాలని టీడీపీ నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. రాజమండ్రిలో భువనేశ్వరి చేసిన నిరాహార దీక్షకు భారీగానే స్పందన లభించడంతో అలాగే… ఆమెతో బస్సు యాత్రను కూడా చేయించాలని పార్టీ నేతలు భావిస్తున్నారు.
Nara Bhuvaneswari : చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై తీర్పు వచ్చాక బస్సు యాత్ర
నారా లోకేష్ ఢిల్లీలో ఉన్నారు. భువనేశ్వరి, బ్రాహ్మణి, బాలకృష్ణ.. ఈ ముగ్గురు రాజమండ్రిలోనే ఉన్నారు. పార్టీ నేతలు చేస్తున్న దీక్షలకు సంఘీభావం తెలుపుతున్నారు. పార్టీ క్యాడర్ కి కూడా వీళ్లు మార్గనిర్దేశనం చేస్తున్నారు. అయితే.. భువనేశ్వరితో బస్సు యాత్ర నిర్వహించాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. రూట్ మ్యాప్ కూడా నిర్ణయించారట. స్కిల్ డెవలప్ మెంట్ కేసుపై ఇప్పటికే కోర్టులో వాదనలు ముగిశాయి. బెయిల్ పై కూడా కోర్టు ఇంకా ఎలాంటి తీర్పు వెల్లడించలేదు. ఆయన రిమాండ్ పై కూడా కోర్టులో వాదనలు ముగిశాయి. కోర్టు నుంచి ఎలాంటి తీర్పు వెలువడుతుందో వేచి చూసి ఆ తర్వాత భువనేశ్వరి బస్సు యాత్ర నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.