Chiranjeevi : చిరంజీవిపై బీజేపీ పెద్దల ఫోకస్.. రాజకీయాలలోకి తీసుకొచ్చేందుకు పవన్ కూడా సై ..!
ప్రధానాంశాలు:
Chiranjeevi : చిరంజీవిపై బీజేపీ పెద్దల ఫోకస్.. రాజకీయాలలోకి తీసుకొచ్చేందుకు పవన్ కూడా సై ..!
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి Chiranjeevi కొన్ని సంవత్సరాల క్రితం రాజకీయాలలోకి వెళ్లి చేతులు కాల్చుకొని తిరిగి సినిమాలలోకి వచ్చి ప్రేక్షకులకి అలరిస్తున్నారు. తన రాజ్యసభ సభ్యత్వం ఇంకా రెండేళ్లు ఉన్నప్పటికీ ఆయన సభాసమావేశాలకు కూడా హాజరు కాలేదు. తాను ప్రత్యక్ష రాజకీయాలకు దూరమని ప్రకటించారు. అయితే మెగా అభిమానుల్లో ఉన్న చిరంజీవికి ఉన్న క్రేజ్‌ని కొన్ని పార్టీలు సీరియస్‌గా తీసుకుని చిరంజీవి చరిష్మాకు గాలం వేస్తూనే ఉన్నాయి. కాషాయం పార్టీ ఐతే.. మెగా ఫ్యామిలీ Mega Family మూమెంట్స్‌ని ఓరకంట కనిపెడుతూనే ఉంది.
Chiranjeevi ఏం జరగనుంది…
మెగా ఫ్యామిలీ అంటే తొమ్మిది మంది హీరోల బలమైన కూటమి. అందులో పవన్‌కల్యాణ్‌కుండే ఫ్యాన్‌బేస్ ఇప్పటికే పరోక్షంగా బీజేపీ BJP కనుసన్నల్లోనే ఉంది. ఏపీలో AP BJP బీజేపీతో కలిసి కూటమి కట్టి పవర్లోకొచ్చిన పవన్‌కల్యాణ్… Pawan Kalyan ఆ తర్వాత ప్రధాని మోదీకి బాగా దగ్గరివాడయ్యాడు. అప్పట్లో వైసీపీ Ycp కూడా కూడా చిరుకు రాజ్యసభ సీటు ఆఫర్ చేసిందని ప్రచారం జరిగింది.దాన్ని చిరంజీవి కూడా ఖండించారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని చెప్పారు. అయినా బీజేపీ BJP మాత్రం ఆయనను ఆకర్షించడానికి అదే ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీ నివాసంలో జరిగిన సంక్రాంతి సంబరాలకు.. చిరంజీవిని Chiranjeevi అతిథిగా ఆహ్వానించారు. ప్రత్యేకంగా ఆయననే ఆహ్వానించడం వెనుక ప్రత్యేకమైన సమీకరణాలు లేవని అనుకోలేమని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే బీజేపీ ఎం చేసినా పూర్తి స్థాయిలో రాజకీయ కోణంలోనే చేస్తుంది.
గత కొద్ది రోజులుగా కేంద్ర మంత్రి వర్గంలోకి చిరంజీవి చేరనున్నారనే వార్తలు delhi ఢిల్లీలో వైరల్ అవుతున్నాయి. గతంలోనూ చిరంజీవి కాంగ్రెస్ Congress లో కేంద్ర మంత్రిగా పని చేసారు. చిరంజీవి కేంద్ర మంత్రిగా వచ్చిన ప్రతిపాదనకు అంగీకరిస్తే జనసేన నుంచి రాజ్యసభకు ఎంపిక చేయాలనేది పవన్ ప్లాన్ గా రాజకీయ వర్గాలలో చర్చ నడుస్తుంది. ఈ ప్రచారాలు చూస్తుంటే మరో రెండు నెలల్లో ఏపీ కేంద్రంగా మెగా బ్రదర్స్ రాజకీయ భవిష్యత్ లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.