Bojja Aiswarya : నీ వెనకాల కుక్కల తిరిగితే నువ్వు చేసేది ఇదా .. జగన్ పై ఫైర్ అయిన బొజ్జ ఐశ్వర్య..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Bojja Aiswarya : నీ వెనకాల కుక్కల తిరిగితే నువ్వు చేసేది ఇదా .. జగన్ పై ఫైర్ అయిన బొజ్జ ఐశ్వర్య..!

Bojja Aiswarya : ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి Ys jagan పై ఆరోపణలు చేస్తూ వెలుగులోకి వచ్చింది బొజ్జ ఐశ్వర్య. కాకినాడకు చెందిన ఈమె జగన్  Ys jagan ఏపీకి ఏం చేసాడని, రౌడీ రాజ్యం నడిపాడని చెప్పుకొచ్చారు. 2014లో బీటెక్ చదువుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవరో తెలియదని, రాజశేఖర్ రెడ్డి వలన బీటెక్ లో జాయిన్ అయ్యానని, ఆయన వల్లే సీటు వచ్చిందని, ఆయనను ఒక తండ్రి లాగా భావించాను కానీ ఆయన తర్వాత […]

 Authored By anusha | The Telugu News | Updated on :28 November 2023,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Bojja Aiswarya : నీ వెనకాల కుక్కల తిరిగితే నువ్వు చేసేది ఇదా ..

  •  Bojja Aiswarya జగన్ పై ఫైర్ అయిన బొజ్జ ఐశ్వర్య..!

Bojja Aiswarya : ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి Ys jagan పై ఆరోపణలు చేస్తూ వెలుగులోకి వచ్చింది బొజ్జ ఐశ్వర్య. కాకినాడకు చెందిన ఈమె జగన్  Ys jagan ఏపీకి ఏం చేసాడని, రౌడీ రాజ్యం నడిపాడని చెప్పుకొచ్చారు. 2014లో బీటెక్ చదువుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవరో తెలియదని, రాజశేఖర్ రెడ్డి వలన బీటెక్ లో జాయిన్ అయ్యానని, ఆయన వల్లే సీటు వచ్చిందని, ఆయనను ఒక తండ్రి లాగా భావించాను కానీ ఆయన తర్వాత ఓడిపోయారు. అయినా కూడా జగన్ చేసిన కార్యక్రమాలన్నింటిలో పాల్గొన్నానని, అరికాలి చెప్పులు అరిగిపోయేలా నీ వెనకాల ఏపీ మొత్తం తిరిగాము. 2019లో నువ్వు నీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తిరగనంతగా మేము తిరిగాం.

మేము సపోర్ట్ చేస్తే నువ్వు సీఎం అయ్యావు, మా అన్నయ్య సీఎం అయ్యాడని ఊరంతా చెప్పుకున్నాం, కానీ నువ్వు మాకు ఏం చేసావ్, స్కూల్ కెళ్లే పిల్లలకు ఆహారం దగ్గర నుంచి ప్రతీది కలుషితం చేస్తున్నావు, నువ్వు మంచి చేస్తున్నావని ఫీల్ అయితున్నావా, నీ వెనకాల ఉన్న డప్పు బ్యాచ్ వాళ్ళ డప్పులు మాత్రమే వింటున్నావు, మా ఆకలి బాధలు నీకు వినపడట్లేదు, బ్రిటిష్ పాలనను తీసుకొచ్చావు, నువ్వు పెంచిన ఎంపీలు ఎంఎల్ సీలను చూసి మేము ఎందుకు భయపడాలి, మాకు ఏదో చేస్తారని కదా మేము ఎంచుకుంది, వాళ్లను చూసి మేము ఎందుకు భయపడాలి. ఎస్సీలు, ఎస్టీ, బీసీలకు లోన్స్ రాలేదు. మా బాధలు మీకు వినిపించడం లేదా, నువ్వు సైకియాట్రిస్ట్ ప్రాబ్లం తో బాధపడుతున్నావ్, డాక్టర్కు చూపించుకుంటే మంచిది. డాక్టర్స్ తో నేను మాట్లాడుతాను. మీరు చూపించుకుంటే ఈ బ్రిటిష్ పాలన దూరం అవుతుంది.

రెడ్డీస్ ని పైకి తెచ్చుకున్నావ్, మా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాను.. నిన్ను అడిగే వాళ్ళు లేరు అనుకుంటున్నావా.. 2024 లో ఓటర్ అంటే ఏంటో మీకు చూపిస్తాం, నీకున్న డబ్బుతో, బలంతో, రెడ్డి సామాజిక వర్గంతో దొంగ ఓట్లు వేయించుకొని ఒకవేళ నెగ్గిన నీ గేటు ముందుకొచ్చి కూర్చుంటా, నువ్వు దిగేంతవరకు అక్కడే కూర్చుంటా, మీ ఎమ్మెల్యేలు గడపగడపకు వెళుతున్నారు గా. నేను కూడా అలాగే వెళ్లి జగన్ ఎందుకు వద్దో చెబుతాను. కాకినాడలో గడపగడపకి వెళ్లి ప్రచారం చేస్తాను. ఈ నాలుగు సంవత్సరాల పాలన ఎలా చేసావో నీ మనస్సాక్షికి తెలియాలి. నీకు తెలుసు బైబిల్ ఎంత పవర్ఫులో. దేవుడే నీకు సమాధానం చెబుతాడు. దేవుళ్ళు అంటే ఎవరో కాదు మాలో ఉన్న దేవుళ్లే నీకు సమాధానం చెబుతారు. 2024 లో 175 సీట్లకు నీకు ఎన్ని ఓట్లు వస్తాయో మేము చూపిస్తాం. నువ్వు చేసిన పాపానికి రెట్టింపుని ఇస్తాం. నువ్వు ఎప్పటికైనా మారి మనిషిలా ఉండు 2024 లో నీకు ఒక నమస్కారం. అర్జెంటుగా నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో, వ్యవస్థ మొత్తాన్ని పాడు చేశావు జగన్మోహన్ రెడ్డికి తప్ప మిగతా వాళ్ళ లో ఎవరికి ఓటు వేసిన పర్వాలేదు అని బొజ్జ ఐశ్వర్య జగన్ పై ఆరోపణలు చేశారు.

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది