MLA Ambraham : బీఆర్ఎస్‌కి భారీ షాకిచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యే.. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

MLA Ambraham : బీఆర్ఎస్‌కి భారీ షాకిచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యే.. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక

 Authored By kranthi | The Telugu News | Updated on :24 November 2023,4:00 pm

ప్రధానాంశాలు:

  •  నిన్న మంద జగన్నాథం.. ఇవాళ అబ్రహం.. బీఆర్ఎస్ కు షాక్

  •  నమ్ముకున్న కేడర్ కోసమే పార్టీ మారా

  •  అలంపూర్ లో బీఆర్ఎస్ ఓటమి ఖాయమేనా?

MLA Ambraham : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా వారం రోజుల సమయం కూడా లేదు. ఈనేపథ్యంలో తెలంగాణలో ఈసారి గెలుపు కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అయితే ఈ సారి చాలా బలంగా దూసుకెళ్తోంది. 2018లో జరిగిన ఎన్నికలకు, ఈసారి ఎన్నికలకు చాలా తేడా ఉంది. అప్పుడు వార్ వన్ సైడ్ మాత్రమే కానీ.. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీ దూకుడు చూసి అధికార బీఆర్ఎస్ పార్టీ తట్టుకోలేకపోతోంది. ఎన్నికలకు ఇంకా వారం కూడా సమయం లేదు కానీ.. రాష్ట్రంలో ఇప్పటికీ బీఆర్ఎస్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. దీంతో సీఎ కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు ఏం చేయాలో పాలుపోవడం లేదు. కాంగ్రెస్ పార్టీ చాప కింద నీరులా విస్తరించడంతో ఏం చేయాలో బీఆర్ఎస్ పార్టీకి అర్థం కావడం లేదు. ముచ్చటగా మూడోసారి ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని.. హ్యాట్రిక్ సాధించి తెలంగాణలో ఒక రికార్డ్ సృష్టించాలని బీఆర్ఎస్ ఆశపడుతోంది. కానీ.. అలాంటి అవకాశాలు మాత్రం ప్రస్తుతం తెలంగాణలో కనిపించడం లేదనే చెప్పుకోవాలి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన చాలామంది నాయకులు ఇప్పటికే పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. ఒక తుమ్మల కావచ్చు.. ఒక పొంగులేటి కావచ్చు.. వేముల వీరేశం.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది బీఆర్ఎస్ కీలక నేతలు పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు.

తాజాగా బీఆర్ఎస్ కు చెందిన మరో సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం ఆ పార్టీకి షాకిచ్చాడు. ఎన్నికలకు వారం రోజులే ఉన్న నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చాడు. అలంపూర్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం ఆ పార్టీని వీడి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీ అలంపూర్ టికెట్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన అబ్రహంకి ఇవ్వలేదు. దీంతో అబ్రహం తీవ్ర ఆవేదనకు గురైనట్టు తెలుస్తోంది. మంచి అవకాశం కోసం వెయిట్ చేసిన అబ్రహం.. కాంగ్రెస్ లో పదవి హామీతో ఆ పార్టీలో తాజాగా చేరారు. బీఆర్ఎస్ కు షాకిచ్చి కాంగ్రెస్ లో ఎన్నికలకు ఇంకా వారం కూడా లేని సమయంలో చేరడంతో అలంపూర్ లో బీఆర్ఎస్ కు గట్టి దెబ్బే తగిలిందని చెప్పుకోవాలి.

MLA Ambraham : నిన్న మంద జగన్నాథం.. ఇవాళ అబ్రహం

ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ ఎంపీ మంద జగన్నాథం కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. తాజాగా అబ్రహం కూడా పార్టీని వీడటంతో అలంపూర్ లో ఈసారి గట్టి పోటీ నెలకొననుంది. తనను నమ్ముకున్న కేడర్ కోసమే, తన అనుచరులు, కార్యకర్తల భవిష్యత్తు కోసమే తాను పార్టీ మారినట్టు అబ్రహం స్పష్టం చేశారు. అలాగే.. అలంపూర్ లో సంపత్ ను గెలిపించి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిని ఓడించడం కోసం తమ శాయశక్తులా ప్రయత్నాలు చేస్తామని అబ్రహం వెల్లడించారు.

Advertisement
WhatsApp Group Join Now

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది