Nampally Court : ఇటీవలి కాలంలో సినీ పరిశ్రమకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే నాగార్జున, అల్లు అర్జున్ తదితర ప్రముఖులకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవగా.. తాజాగా దగ్గుబాటి కుటుంబానికి ఎదురుదెబ్బ తగిలింది. ఫిల్మ్ నగర్‌లోని దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత వివాదంగా మారింది. దీన్ని కూల్చేసింది దగ్గుబాటి ఫ్యామిలీనే. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో బాధితుడిగా ఉన్న నందకుమార్ కి చెందిన దక్కన్ కిచెన్ హోటల్ స్థలం విషయంలో దగ్గుబాటి కుటుంబంతో వివాదం నెలకొంది.
ఇది తమది అని వెంకటేష్, Venkatesh సురేష్ బాబులు, వారి ఫ్యామిలీ పట్టుపడుతుంది. కానీ మాది అని నందకుమార్ అంటున్నారు. అందులో హోటల్ కూడా రన్ చేస్తున్నారు. అయితే రెండేళ్ల క్రితమే(2022 నవంబర్)లో జీహెచ్‌ఎంసీ సిబ్బంది, బౌన్సర్లతో కలిసి హోటల్‌ని పాక్షికంగా కూల్చేశారు. దక్కన్ కిచెన్ హోటల్ కూల్చి వేతలో కోర్టు ఆదేశాలున్నా పాటించకుండా దౌర్జన్యం చేసిన దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదు చేసి సమగ్ర విచారణ జరపాలని న్యాయస్థానం ఆదేశించింది.
ఈ మేరకు ఫిలింనగర్ పోలీసులకు నాంపల్లిలోని 17వ నంబర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు శనివారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టారు. ఫిల్మ్ నగర్‌లోని దక్కన్ కిచెన్ హోటల్ అక్రమంగా కూల్చివేసిన ఆరోపణలపై హీరో దగ్గుబాటి వెంకటేశ్, నిర్మాత సురేశ్ బాబు, హీరో రానా, హీరో అభిరామ్‌పై శనివారం పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Viral Video తెలంగాణలో ఈ మధ్య అడవిలో ఉండాల్సిన జంతువులు ఇప్పుడు జనావాసాలలోకి కూడా వస్తున్నాయి. తాజాగా ఒక గుంటనక్క…
Daaku Maharaaj : సంక్రాంతికి సినిమాల సందడి ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఏడాది సంక్రాంతికి డాకు…
Raithu Barosa : సంక్రాంతి పండుగ Sankranti వేళ తెలంగాణ సర్కార్ రైతులకు సంబంధించి ఏదైన తిపి కబురు అందుతుందా…
Jasmine : మల్లెపూలు అందరూ చాలా ఇష్టపడతారు. ఎందుకంటే మల్లెపూల Jasmine యొక్క సువాసన మరియు మల్లెపువ్వు తెలుపు రంగును…
Reliance Jio : భారతదేశంలోని ఇతర టెలికాం దిగ్గజాలు 5G పై నెమ్మదిగా పనిచేస్తుండగా, జియో దాని స్వంత మార్గంలోనే…
Banana Benifits : అరటిపండు తినడం వల్ల మనకి Banana Benifits ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. పండు మనకు…
Makar Sankranti : మకర సంక్రాంతి పండుగ : Makar Sankranti సూర్య భగవానుడు నెలకు ఒక్కసారి ఒక్కొక్క రాశి…
Sankranti Festival : సంక్రాంతి Sankranti సమయంలో ఊరికి అందరూ వెళ్తుంటారు. అది ముఖ్యంగా Andhr pradesh ఆంధ్రప్రదేశ్ కి.…
This website uses cookies.