Nampally Court : ఈ సారి దగ్గుబాటి కుటుంబానికి ఝలక్.. వెంకీ, రానా, అభిరామ్‌పై కేసు
ప్రధానాంశాలు:
Nampally Court : ఈ సారి దగ్గుబాటి కుటుంబానికి ఝలక్.. వెంకీ, రానా, అభిరామ్‌పై కేసు
Nampally Court : ఇటీవలి కాలంలో సినీ పరిశ్రమకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే నాగార్జున, అల్లు అర్జున్ తదితర ప్రముఖులకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవగా.. తాజాగా దగ్గుబాటి కుటుంబానికి ఎదురుదెబ్బ తగిలింది. ఫిల్మ్ నగర్‌లోని దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత వివాదంగా మారింది. దీన్ని కూల్చేసింది దగ్గుబాటి ఫ్యామిలీనే. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో బాధితుడిగా ఉన్న నందకుమార్ కి చెందిన దక్కన్ కిచెన్ హోటల్ స్థలం విషయంలో దగ్గుబాటి కుటుంబంతో వివాదం నెలకొంది.
Nampally Court ఇరుక్కున్నారుగా..
ఇది తమది అని వెంకటేష్, Venkatesh సురేష్ బాబులు, వారి ఫ్యామిలీ పట్టుపడుతుంది. కానీ మాది అని నందకుమార్ అంటున్నారు. అందులో హోటల్ కూడా రన్ చేస్తున్నారు. అయితే రెండేళ్ల క్రితమే(2022 నవంబర్)లో జీహెచ్‌ఎంసీ సిబ్బంది, బౌన్సర్లతో కలిసి హోటల్‌ని పాక్షికంగా కూల్చేశారు. దక్కన్ కిచెన్ హోటల్ కూల్చి వేతలో కోర్టు ఆదేశాలున్నా పాటించకుండా దౌర్జన్యం చేసిన దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదు చేసి సమగ్ర విచారణ జరపాలని న్యాయస్థానం ఆదేశించింది.
ఈ మేరకు ఫిలింనగర్ పోలీసులకు నాంపల్లిలోని 17వ నంబర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు శనివారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టారు. ఫిల్మ్ నగర్‌లోని దక్కన్ కిచెన్ హోటల్ అక్రమంగా కూల్చివేసిన ఆరోపణలపై హీరో దగ్గుబాటి వెంకటేశ్, నిర్మాత సురేశ్ బాబు, హీరో రానా, హీరో అభిరామ్‌పై శనివారం పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.