Breaking News : బ్రాహ్మణి, భువనేశ్వరి, బాలకృష్ణపైనా కేసులు.. జగన్ బిగ్ ప్లాన్ అదుర్స్? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Breaking News : బ్రాహ్మణి, భువనేశ్వరి, బాలకృష్ణపైనా కేసులు.. జగన్ బిగ్ ప్లాన్ అదుర్స్?

 Authored By kranthi | The Telugu News | Updated on :29 September 2023,6:00 pm

Breaking News : ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా చంద్రబాబు అరెస్ట్ గురించే చర్చ నడుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ పై ప్రతి ఒక్కరు తమకు తోచిన విధంగా మాట్లాడుతున్నారు. కానీ.. ఇప్పటి వరకు బయటికి రాని నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి మాత్రం నడిరోడ్డు మీదికి వచ్చి నిరసన తెలుపుతున్నారు. నారా భువనేశ్వరి, బ్రాహ్మణి అయితే ప్రతి రోజు చంద్రబాబుకు మద్దతు ఇచ్చే వాళ్లతో ర్యాలీలు చేస్తున్నారు.. ధర్నాలు చేస్తన్నారు. కానీ.. వైసీపీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. కనీసం వాళ్లను స్వేచ్ఛగా ర్యాలీలు కూడా చేసుకోనీయడం లేదు. ధర్నాలు చేసుకోనీయడం లేదు. ఎక్కడికక్కడ ఆపేస్తున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉన్నారు. ఆయన అరెస్ట్ కి సంబంధించి రోజుకో మలుపు తిరుగుతోంది.

చంద్రబాబుకు బెయిల్ ఎంతటికీ రావడం లేదు. చంద్రబాబు ఇప్పట్లో రిలీజ్ అయ్యే చాన్స్ లేదని చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. మరో కీలక విషయం చర్చకు వచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ లో భువనేశ్వరి, బ్రాహ్మణి, బాలకృష్ణ పేర్లు కూడా చేర్చారు. ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ లో కూడా నారా లోకేష్ తో పాటు బ్రాహ్మణి, భువనేశ్వరి, బాలకృష్ణ పేర్లను సీఐడీ చేర్చిందట. దీనిపై సీఐడీ త్వరలోనే నారా లోకేష్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. చంద్రబాబు తర్వాత నేరుగా లోకేష్ ను అరెస్ట్ చేస్తారని అంతా అనుకున్నారు కానీ.. లోకేష్ తో పాటు బ్రాహ్మణి, భువనేశ్వరి, బాలకృష్ణ పేర్లను చేర్చి వారిని విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

cases against brahmani bhuvaneshwari and balakrishna

#image_title

Breaking News : వీళ్లు పేర్లు ఎందుకు చేర్చినట్టు?

ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ లో హెరిటేజ్ సంస్థకు లబ్ధి చేకూరినట్టుగా సీఐడీ అధికారులు అనుమానిస్తున్నారు. అలాగే.. బాలకృష్ణకు కూడా ఈ స్కామ్ లో పాత్ర ఉందని చెబుతున్నారు. ఈనేపథ్యంలో నారా లోకేష్ తో పాటు బ్రాహ్మణి, భువనేశ్వరి, బాలకృష్ణ కూడా విచారణ ఎదుర్కునే అవకాశం ఉంది. వాళ్లు కూడా విచారణకు హాజరయితే.. వాళ్లకు లబ్ధి చేకూరినట్టు రుజువు అయితే వాళ్లను కూడా సీఐడీ అధికారులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో?

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది