Chandrababu : వైసీపీలోకి కోవర్టులను దింపిన చంద్రబాబు.. ఫలిస్తున్న ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు?

Authored By Breaking News 2 | The Telugu News | Updated on: December 27, 2023, 4:07 pm
  •  చంద్రబాబు కోవర్టులు వైసీపీలో పని చేస్తున్నారా?

  •  వైసీపీ అసంతృప్తులకు ఎర వేయబోతున్న చంద్రబాబు

  •  చంద్రబాబు వ్యూహం ఫలిస్తుందా?

Chandrababu : ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాలు రోజు రోజుకూ యూటర్న్ తిరుగుతున్నాయి. అసలు ఏ నాయకుడు ఎప్పుడు ఏ పార్టీలో చేరుతాడో.. ఏ పార్టీ ఎప్పుడు ఎలాంటి హామీలను ప్రకటిస్తుందో.. ఎవరికి ఎక్కడ టికెట్ ఇస్తారో.. అంటూ ఇలాంటి చర్చలే జోరుగా సాగుతున్నాయి. మరోవైపు ఏపీలో సంక్రాంతి హడావుడి స్టార్ట్ అయింది. మధ్యలో రాజకీయ హడావుడి మొత్తం మీద ఏపీలో ఎక్కడ చూసినా ఇదే చర్చ. ప్రశాంత్ కిషోర్ ఈ మధ్యే టీడీపీకి వ్యూహకర్తగా చేరడంతో టీడీపీకి కొండంత బలం వచ్చినంత పని అయింది. వెంటనే ప్రశాంత్ కిషోర్ తన పని మాత్రం మొదలు పెట్టేశారు. ఓవైపు సిట్టింగ్ ఎమ్మెల్యేలను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మార్చుతుండటం, కొందరు అసంతృప్తి ఎమ్మెల్యేలు కూడా టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తుండటంతో చంద్రబాబు అటు నుంచి నరుక్కుంటూ వస్తున్నారు. వాళ్లకు గాలమేయడం స్టార్ట్ చేస్తున్నారు.

తెలంగాణ ఎన్నికల తర్వాత భారీగా సిట్టింగ్ లను మార్చుతున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అసలు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్ ఇవ్వలేని పరిస్థితుల్లో సీఎం ఉంటే.. వాళ్ల అవినీతిని ఇన్నేళ్లలో ఎందుకు అరికట్టలేకపోయారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో టీడీపీకి అనుకూల పవనాలు వీస్తున్నాయి. వైసీపీ అవినీతితో ప్రజలు టీడీపీ వైపు చూస్తున్నారు. ఈ ఐదేళ్లలో ఏపీలో చేసిన అభివృద్ధి ఏం లేదని ప్రజలు జగన్ కు తీవ్రంగా వ్యతిరేకం అవుతున్నారు. ఒకవేళ వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చితే వాళ్లంతా టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారట.

Chandrababu : 80 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మర్చితే ఎలా?

ఒకవేళ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 80 మందికి జగన్ టికెట్ ఇవ్వకపోతే మాత్రం అందులో కనీసం 50 మంది వరకు మాత్రం టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కానీ.. మిగితా వాళ్లు మాత్రం వైసీపీలోనే ఉంటూ ఆఖరి నిమిషం వరకు టీడీపీకి పని చేయబోతున్నారు. ఇలాంటి కోవర్టులను తయారు చేయడానికి చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారట. వైసీపీలో ఉన్న అసంతృప్తి నేతలను చంద్రబాబు ఆకర్షించి వాళ్లను తనకు కోవర్టులుగా తయారు చేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp