Chandrababu : చంద్రబాబు కు కొత్త తలనొప్పిని తీసుకొచ్చిన కేంద్రం..?
ప్రధానాంశాలు:
Chandrababu : చంద్రబాబు కు కొత్త తలనొప్పిని తీసుకొచ్చిన కేంద్రం..?
Chandrababu : ఆంధ్రప్రదేశ్ అధికార కూటమిలో ఉన్న బీజేపీకి మరో మంత్రి పదవి కేటాయించే అంశంపై చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఉగాది నాటికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారు. ఈ క్రమంలో బీజేపీ హైకమాండ్ నుంచి మరో మంత్రి పదవి కోసం డిమాండ్ వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం బీజేపీ నుంచి ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ మంత్రి పదవి చేపట్టగా, మరొక మంత్రి స్థానం బీజేపీకి దక్కుతుందా? లేదా? అన్నదాని పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. బీజేపీ నాయకులు కూటమి భాగస్వామిగా తగిన ప్రాధాన్యం దక్కాలనే అభిప్రాయంతో మరో పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.

Chandrababu : చంద్రబాబు కు కొత్త తలనొప్పిని తీసుకొచ్చిన కేంద్రం..?
Chandrababu చంద్రబాబు బిజెపి కి మరో మంత్రి పదవి ఇస్తాడా..?
ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వీరిలో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు వంటి సీనియర్ నేతలు మంత్రివర్గంలో చోటు కోసం పోటీపడుతున్నారు. అయితే చంద్రబాబు సాధారణంగా తక్కువ మార్పులతో మంత్రివర్గ విస్తరణ చేసే వ్యక్తి కావడంతో, కేవలం ఒకరిద్దరినే తొలగించి కొత్త వారిని తీసుకునే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనితో బీజేపీకి ఇంకో మంత్రి పదవి ఖాయమా? లేక ఇప్పట్లో లేదు అని స్పష్టత రావాల్సి ఉంది.
ఇక మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న ఒక పదవి జనసేన కోటాలో నాగబాబుకు దక్కే అవకాశముందని ఇప్పటికే సమాచారం ఉంది. దీంతో చంద్రబాబు మరో మంత్రిని తప్పించి బీజేపీ నేతకు అవకాశం ఇస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. కూటమిలో సమతుల్యతను కాపాడే విధంగా చంద్రబాబు వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ తర్వాత బీజేపీకి సరిపడే ప్రాధాన్యత దక్కిందా? లేదా? అన్నదానిపై స్పష్టత వస్తుంది. ఈ పరిణామాలు ఏపీలో రాజకీయంగా కీలక మలుపులు తిరిగేలా చేస్తున్నాయి.