
Chandrababu : నూతన సంవత్సరంలో చంద్రబాబు తీపి కబురు...!
Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడు నెలల పాలన పూర్తి చేసుకోగా, వారు ఇచ్చిన ఎన్నికల హామీలని ఒక్కొక్కటిగా తీర్చే పనిలో పడ్డారు. వైసీపీ హయాంలో మాదిరిగా కాకుండా మద్యం దుకాణాలలో నగదు రహిత లావాదేవీలు జరుగుతున్నాయి. రోడ్లపై ఫోకస్ చేసిన కూటమి ప్రభుత్వం మరోవైపు ఏపీ నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సైతం ఉక్కుపాదం మోపుతోంది. నూతన సంవత్సరం సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పే అవకాశం కన్పిస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయనేది ఉద్యోగుల ఆశగా ఉంది.
Chandrababu : నూతన సంవత్సరంలో చంద్రబాబు తీపి కబురు…!
అందుకు తగ్గట్టే ప్రభుత్వం కీలకమైన ప్రకటన చేయవచ్చని సమాచారం. ఉద్యోగులకు సంక్రాంతి పురస్కరించుకుని భారీ నజరానా ప్రకటించే అవకాశం కన్పిస్తోంది. సంక్రాంతి పురస్కరించుకుని భారీ నజరానా ప్రకటించనున్నారు. సంక్రాంతికి ఉద్యోగులకు రెండు డీఏలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. 11 గంటలకు జరగనున్న ఏపీ కేబినెట్ భేటీలో ఈ విషయంపై నిర్ణయం తీసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. వెలగపూడిలోని సచివాలయం 1వ బ్లాక్ లో మంత్రిమండలి సమావేశముంది. ఈ భేటీలో రెండు డీఏలు ప్రకటించవచ్చని తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలతో పాటు పీఆర్సీ, ఐఆర్‌పై కూడా చర్చించి నిర్ణయం తీసుకోవచ్చు.
నెలకు రెండుసార్లు ఏపీ కేబినెట్ సమావేశం కావాలని చంద్రబాబు నిర్ణయించారు. ఆ మేరకు ఈ నెలలో మొదటి కేబినెట్ భేటీ జరగనుంది. సంక్రాంతి కానుకగా రెండు డీఏలు ప్రకటించవచ్చు. వెలగపూడిలోని సచివాలయం 1వ బ్లాక్ లో గురువారం నాడు ఏపీ మంత్రివర్గం సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ రోజు టీడీపీ కార్యకర్తలు, నాయకులను సీఎం చంద్రబాబు కలవనున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో దేశవ్యాప్తంగా సంతాప దినాలు కొనసాగుతున్నందున న్యూ ఇయర్ శుభాకాంక్షల కోసం తన వద్దకు బొకేలు, శాలువాలు తేవద్దని ఆయన సూచించారు. కేక్ కటింగ్ వంటి కార్యక్రమాలు కూడా వద్దని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు.
Protein Food : ప్రస్తుతం ఫిట్‌నెస్, వెయిట్ లాస్, మసిల్ బిల్డింగ్‌పై ఆసక్తి పెరగడంతో ప్రోటీన్ గురించి అవగాహన కూడా…
Snakes : ప్రపంచంలో దాదాపు ప్రతి దేశంలోనూ పాములు కనిపిస్తాయి. అడవులు, పర్వతాలు, ఎడారులు, గ్రామాలు ఇలా ఎక్కడైనా వాటి…
Watermelon vs Muskmelon : వేసవి కాలం వచ్చిందంటే చాలు.. మార్కెట్లలో పుచ్చకాయలు, ఖర్బూజాలు కనిపించడం మొదలవుతుంది. శరీరానికి చల్లదనం…
Apple Cider Vinegar : ఇటీవల కాలంలో బరువు తగ్గేందుకు చాలామంది ఆపిల్ సైడర్ వెనిగర్ (ACV)ను తమ డైట్‌లో…
Migraine : రోజంతా మొబైల్, ల్యాప్‌టాప్, టీవీ స్క్రీన్‌ల ముందే గడుపుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఉద్యోగం, చదువు,…
Tea : భారతీయ కుటుంబాల్లో టీకి ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉదయం నిద్రలేవగానే ఒక…
Gold Ban In India : భారతీయులకు బంగారానికి ఉన్న భావోద్వేగ అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.…
TATA : ఈ రోజుల్లో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా దీర్ఘకాల పెట్టుబడుల…
సోషల్ మీడియాలో సెలబ్రిటీల చిన్ననాటి ఫొటోలు ఎప్పుడూ నెటిజన్లను ఆకట్టుకుంటుంటాయి. ముఖ్యంగా హీరోయిన్ల స్కూల్ డేస్ ఫొటోలు బయటకు వస్తే…
Hantavirus : ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి జ్ఞాపకాలు ఇంకా మర్చిపోకముందే ఇప్పుడు మరో వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది.…
LPG Cylinder Rule : దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరాపై ఆందోళనలు పెరుగుతున్న వేళ ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో…
CM Vijay Trisha : తమిళనాడు రాజకీయాల్లో చరిత్రాత్మక మార్పుకు నాంది పలుకుతూ ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీ…
This website uses cookies.