Jr NTR : కావాలని ఎన్టీఆర్ ని టార్గెట్ చేయడం కోసం చంద్రబాబు ఇంతకి దిగాజారారా?

Authored By Breaking News 2 | The Telugu News | Published on: June 29, 2023, 9:00 pm

Jr NTR : గత కొన్ని రోజులుగా ఓ ఘటన వైరల్ అవుతోంది. అది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ శ్యామ్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకోవడం. సెల్ఫీ వీడియో తీసుకొని మరీ ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు కారణాలు ఏంటో కూడా స్పష్టంగా ఆ వీడియోలో తెలిపాడు. తనకు ఉద్యోగం చేయడం ఇష్టం లేదు అని చెబుతూ.. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని తన తల్లిదండ్రులకు తెలిపాడు శ్యామ్.అయితే.. కేవలం ఉద్యోగం చేయడం మాత్రమే ఇష్టం లేదా.. ఇంకా వేరే కారణాలు ఉన్నాయా అనేది తెలియదు. నిజానికి ఉద్యోగం చేయడం ఇష్టం లేనంత మాత్రాన ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయం తీసుకుంటారా? శ్యామ్ మరణం కాస్త అనుమానాస్పదంగా ఉందని పోలీసులు కూడా లోతుగా విచారణ చేయాల్సి ఉంటుంది.

ఇక్కడే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి నీచ రాజకీయాలు బయటపడ్డాయి. శ్యామ్ ను వైసీపీ కార్యకర్తలే హత్య చేశారు అంటూ కొత్త కోణాన్ని బయటికి తీశారు.శ్యామ్ ఘటన ఇంత హడావుడి కాకపోయేది కానీ.. అతడు జూనియర్ ఎన్టీఆర్ అభిమాని కావడంతో శ్యామ్ ఘటనపై అందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు. అయితే.. తన ఫ్రెండ్స్ కూడా ఇది ఆత్మహత్య కాదు.. అంటున్నారు. శ్యామ్ మృతికి ప్రేమే కారణం అంటున్నారు. కొన్ని వ్యక్తిగత కారణాలు కూడా ఉన్నాయంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే చంద్రబాబు శవాల మీద చేసే రాజకీయం చూసి ఏపీ ప్రజలు చిరాకు వచ్చేసింది.

chandrababu targets on Jr ntr fan shyam case

chandrababu targets on Jr ntr fan shyam case

Jr NTR : ఆ నిజాలను పోలీసులు బయటికి తీసుకురావాలన్న చంద్రబాబు

తందనానా అన్నట్టుగా నారా లోకేష్ కూడా చంద్రబాబు ట్వీట్ కు వత్తాసు పలుకుతూ.. శ్యామ్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు తాము పోరాడుతాం అంటూ ట్వీట్ చేశారు. అసలు చంద్రబాబుకు మెదడు మోకాళ్లలో ఉందా? ఏపీలో ఏ ఘటన జరిగినా దాన్ని వైసీపీ ప్రభుత్వానికే ముడి పెడతారా? ఏపీ ప్రజలకు మాత్రం చంద్రబాబుపై చిర్రెత్తుకొస్తోంది. వాళ్ల కోపాన్ని మొత్తం వచ్చే ఎన్నికల్లో తమ ఓటుతో చూపించేందుకు సిద్ధంగా ఉన్నారు. బీ రెడీ చంద్రబాబు.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp