Donald Trump : చివరి నిమిషంలో ట్రంప్ ప్రమాణ స్వీకార వేదిక మార్పు, 40 ఏళ్లలో తొలిసారి
ప్రధానాంశాలు:
Donald Trump చివరి నిమిషంలో ట్రంప్ ప్రమాణ స్వీకార వేదిక మార్పు, 40 ఏళ్లలో తొలిసారి
Donald Trump : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న తన ప్రమాణ స్వీకారం అమెరికా కాపిటల్ లోపల జరుగుతుందని ప్రకటించారు. ‘ట్రూత్ సోషల్’ పై ఒక పోస్ట్‌లో ట్రంప్ ఇలా అన్నారు, “దేశాన్ని ఆర్కిటిక్ పేలుడు ముంచెత్తుతోంది. ప్రజలు ఏ విధంగానూ గాయపడటం లేదా ఇబ్బందులు నేను చూడకూడదనుకుంటున్నాను. అందువల్ల, ప్రార్థనలు మరియు ఇతర ప్రసంగాలతో పాటు, ప్రారంభోత్సవ ప్రసంగాన్ని యునైటెడ్ స్టేట్స్ కాపిటల్ రోటుండాలో చేయాలని నేను ఆదేశించాను.” 1985లో మాజీ రిపబ్లికన్ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ రెండవ ప్రమాణ స్వీకారం కోసం చివరిసారిగా ప్రారంభోత్సవాన్ని ఇంటి లోపలికి తరలించారు.
Donald Trump : అమెరికా 47వ అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్
అమెరికా 47వ అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trumph) సోమమవారం మధ్యాహ్నం 12.05 గంటలకు అధికారికంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ చారిత్రక ఘట్టంలో పాల్గొనేందుకు క్యాపిటల్ హిల్‌లోని రొటుండా ఇండోర్ ఆవరణకు ప్రంపంచ దేశాధినేతలు, ముఖ్య అతిథులు, టెక్ జెయింట్స్ చేరుకుంటున్నారు.
సహజంగా అమెరికా అధ్యక్షుడు ప్రమాణ స్వీకారానికి సహజం క్యాపిటల్ భవనం పశ్చిమ భాగంలోని నేషనల్ మాల్, జాతీయ చిహ్నాల ఎదుట వేలాది మంది సమక్షంలో ప్రమాణ స్వీకారం జరపడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి చలితీవ్రత ఎక్కువగా ఉండటంతో క్యాపిటల్ భవనం లోపల ఉండే రొటుండా సముదాయంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గతంలో రోనాల్డ్ రీగన్ చలి కారణంగా రొటుండాలో ప్రమాణస్వీకారం చేశారు. 40 ఏళ్ల తర్వాత ట్రంప్ ఇదే వేదికను చివరి నిమషంలో ఎంచుకున్నారు.