Chiranjeevi : అంద‌రి అనుమానాల‌కి చెక్ పెట్టిన చిరంజీవి.. రాజ‌కీయాలు వ‌ద్దు, సినిమాలే ముద్దు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chiranjeevi : అంద‌రి అనుమానాల‌కి చెక్ పెట్టిన చిరంజీవి.. రాజ‌కీయాలు వ‌ద్దు, సినిమాలే ముద్దు..!

 Authored By ramu | The Telugu News | Updated on :12 February 2025,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Chiranjeevi : అంద‌రి అనుమానాల‌కి చెక్ పెట్టిన చిరంజీవి.. రాజ‌కీయాలు వ‌ద్దు, సినిమాలే ముద్దు..!

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి Chiranjeevi పొలిటిక‌ల్ ఎంట్రీ గురించి కొద్ది రోజులుగా సోష‌ల్ మీడియాలో Social Media అనేక ప్ర‌చారాలు సాగుతున్నాయి. మెగాస్టార్ జనసేన పార్టీలో Janasena Party చేరుతారని.. కాదు బీజేపీ BJP తీర్ధం పుచ్చుకుంటారనే వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన తాజాగా బ్ర‌హ్మా ఆనందం మూవీ ఈవెంట్‌లో క్లారిటీ ఇచ్చారు. చిరంజీవి స్టేట్‌మెంట్ మెగా అభిమానుల్ని ఒకింత నిరుత్సాహానికి గురిచేసినట్లైంది. అయితే చిరంజీవి మాత్రం తాను సినిమాల్లో ఉంటేనే ప్రశాంతంగా ఉందని.. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చాలా ఒత్తిడికి లోనైనట్లుగా చెప్పారు.

Chiranjeevi అంద‌రి అనుమానాల‌కి చెక్ పెట్టిన చిరంజీవి రాజ‌కీయాలు వ‌ద్దు సినిమాలే ముద్దు

Chiranjeevi : అంద‌రి అనుమానాల‌కి చెక్ పెట్టిన చిరంజీవి.. రాజ‌కీయాలు వ‌ద్దు, సినిమాలే ముద్దు..!

Chiranjeevi పుకార్ల‌కి చెక్..

జీవితాంతం కళామతల్లి సేవలోనే ఉంటానని చిరంజీవి స్పష్టం చేశారు. సినీరంగానికి సేవలు, ఇతర సేవా కార్యక్రమాల కోసమే రాజకీయ పెద్దలను కలుస్తున్నానని ఆయన చెప్పారు. అంతకు మించి ఏమీ లేదన్నారు. రాజకీయంగా తాను అనుకున్న లక్ష్యాలు, సేవలు నెరవేర్చేందుకు తమ్ముడు పవన్‌ కల్యాణ్‌ ఉన్నాడని చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ‘బ్రహ్మా ఆనందం’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి చిరంజీవి అతిథిగా హాజరై ఈ వ్యాఖ్యలు చేశారు. నా కలలను ప‌వ‌న్ నేరవేరుస్తారనే ప్రగాఢ నమ్మకం ఉంది అని చిరంజీవి అన్నారు.

24 గంటల క్రితం ఇదే మెగాస్టార్ చిరంజీవి లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రజారాజ్యం రూపాంతరం చెంది జనసేన అయిందని కామెంట్ చేశారు. దాంతో చిరంజీవి పొలిటిక‌ల్ ఎంట్రీపై అనేక చ‌ర్చ‌లు న‌డిచాయి. అయితే ఇప్పుడేమో తన రాజకీయ లక్ష్యాలను తన సోదరుడు పవన్ కల్యాణ్ నెరవేరస్తాడని చెప్పి పొలిటికల్ రీఎంట్రీపై చిరు శుభం కార్డు వేశారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది