ys jagan : సచివాలయం ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చిన సీఎం జగన్.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

ys jagan : సచివాలయం ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చిన సీఎం జగన్..

 Authored By brahma | The Telugu News | Updated on :1 March 2021,10:33 am

ys jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలనను గ్రామస్థాయి వరకు తీసుకెళ్లిన ఘనత ఖచ్చితంగా సీఎం జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుంది. గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి, ప్రజల వద్దకే పాలనా అనే దానికి సరైన నిర్వచనం ఇచ్చాడు. అయితే సచివాలయాల విషయంలో సీఎం జగన్ అనుకున్నంత పని జరగటం లేదనే మాటలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సచివాలయాలు ఉద్యోగుల మీద కొన్ని ఫిర్యాదులు వస్తున్నాయి. అలాంటి వాటికీ చెక్ పెట్టె విధంగా సీఎం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నాడు.

ys jagan

ys jagan : బయోమెట్రిక్ తప్పనిసరి

ఇకపై సచివాలయం ఉద్యోగులు బయోమెట్రిక్ విధానం తప్పనిసరిగా వాడాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బయోమెట్రిక్ హాజరుని తప్పనిసరి చేస్తూ గతంలో ఉత్తర్వులిచ్చినా మిషన్ పనిచేయలేదని, ఆన్ డ్యూటీ అని, రకరకాల కారణాలు చెప్పి తప్పించుకున్నారు.అయితే బయోమెట్రిక్ వ్యవహారంపై కఠినంగా ఉండాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 1నుంచి దాన్ని తప్పనిసరి చేసింది. ఇకపై సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు లేకపోతే ఆ రోజుకి జీతం పడదు.

అలాంటి వారికీ చెక్

గతంలో సచివాలయం ఉద్యోగులు ఏమైనా పనులు ఉంటేనే సచివాలయానికి వెళ్లేవారు. పెద్దగా పనులు లేకపోతే ఇంటి నుండే మేనేజ్ చేసేవాళ్ళు, ఎప్పుడైనా సచివాలయం వెళ్ళినప్పుడు హాజరు పట్టి నింపేసేవారు. దీనిపై ఫిర్యాదులు రావటంతో ఎంపీడీవోలు, ఎమ్మార్వోలు తనిఖీలు చెప్పట్టారు. కాకపోతే చాలా సమయం ఈ తనిఖీలకే సరిపోవటంతో వాళ్ళు దీనిని పక్కన పెట్టారు. దీనితో సచివాలయం ఉద్యోగులు ఆడిందే ఆటగా మారిపోయింది. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని బయోమెట్రిక్ హాజరుని తప్పనిసరి చేశారు అధికారులు. దీంతోపాటు సాయంత్రం 3నుంచి 5 గంటల వరకు కచ్చితంగా సచివాలయంలోనే ఉండాలనే నిబంధన విధించారు. అంతే కాదు, ఆ సమయంలో ఫిర్యాదులివ్వడానికి వచ్చినవారు, ఉద్యోగులు లేని విషయాన్ని గమనించి ఫిర్యాదు చేస్తే, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదే సమయంలో ప్రభుత్వ పనులన్నీ కూడా ఖచ్చితమైన సమయంలోనే పూర్తి చేయాలంటే నిబంధనను కూడా తీసుకోని వచ్చారు 20 రోజుల్లోపు ఆరోగ్యశ్రీ కార్డు, 10 రోజుల్లో రైస్ కార్డు, 21 రోజుల్లో పెన్షన్ కార్డు, 90 రోజుల్లో ఇంటి పట్టాలు.. దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులను ఎంపిక చేసి ఇవ్వాలి. తాజాగా ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలు వలన సచివాలయం ఉద్యోగులు కొన్ని రోజులు ఇబ్బంది పడిన కానీ అంతిమంగా సీఎం జగన్ ఏ లక్ష్యంతో సచివాలయాలు ఏర్పాటు చేశాడో, ఆ లక్ష్యాలు చేరుకోవటానికి ఖచ్చితంగా ఉపయోగపడుతాయి.

brahma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది