Telangana Students : తెలంగాణ విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్ చెప్ప‌నున్న సీఎం రేవంత్ రెడ్డి.. త‌ర్వ‌లో మ‌రో ప‌థ‌కం అమ‌లు..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Telangana Students : తెలంగాణ విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్ చెప్ప‌నున్న సీఎం రేవంత్ రెడ్డి.. త‌ర్వ‌లో మ‌రో ప‌థ‌కం అమ‌లు..?

 Authored By anusha | The Telugu News | Updated on :24 December 2023,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Telangana Students : తెలంగాణ విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్ చెప్ప‌నున్న సీఎం రేవంత్ రెడ్డి.. త‌ర్వ‌లో మ‌రో ప‌థ‌కం అమ‌లు..?

Telangana Students : ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు ఒక్కొక్క అడుగు పడుతుండడంతో ఎలక్ట్రానిక్ స్కూటీల పథకం కూడా అమలు చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాబోయే పార్లమెంట్ ఎన్నికల లోపు ఈ పథకాన్ని అమలు చేసి యువ ఓటర్లను ఆకర్షించే వ్యూహంతో కాంగ్రెస్ అడుగులు వేస్తుంది. రెగ్యులర్ గా కాలేజీలకు వెళ్లే వారికి మాత్రమే పథకం వర్తించేలా కార్యాచరణకు రంగం సిద్ధమవుతుంది. విద్యార్థిని కుటుంబం బిపిఎల్ గా గుర్తింపునకు కుటుంబ రేషన్ కార్డు పరిగణలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో పేద విద్యార్థినిలు ఐదు లక్షల మంది వరకు ఉండగా వీరిలో రెండు లక్షల మంది మహానగర పరిధిలో ఉన్నట్లు ప్రాథమిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వీరిలో ప్రభుత్వ కాలేజీలో చదువుతున్న వారు 70 వేల మంది వరకు ఉండవచ్చని అంచనా. తొలి విడతలో ప్రభుత్వ కాలేజీలో చదువుతున్న విద్యార్థినీలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చేలా నిబంధనల రూపకల్పన జరుగుతున్నట్లు సమాచారం.

ఎలక్ట్రానిక్ స్కూటీల పథకం పెద్ద ఖర్చుతో కూడుకున్నదే. ఎలక్ట్రిక్ స్కూటీ సామర్థ్యం 40 వేల నుంచి 1.5 లక్షలకు పైగా ధర ఉంటుంది. ఫ్యాక్టరీ నుంచి రాయితీ రావడంతో కనీసం ఒక్క స్కూటీ కి సగటున 50 వేల చొప్పున ధర లెక్కిస్తే సుమారు 350 కోట్ల ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ స్కూటీలకు డ్రైవింగ్ లైసెన్స్ లు తప్పనిసరి. లైసెన్స్ తీయడం విద్యార్థినీలకు కత్తి మీద సామే. చాలామందికి వాహనం నడపటం వచ్చినప్పటికీ డ్రైవింగ్ లైసెన్స్ లేవు. వారికి రహదారి భద్రత గురించి అవగాహన తక్కువగా ఉండడం రోడ్డు ప్రమాదాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇన్సూరెన్స్ వర్తించే అవకాశం సైతం ఉండదు. ప్రభుత్వ విద్యార్థినిలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది అంటే ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న పేద విద్యార్థినీలకు ఈ పథకం అందకపోవచ్చు.

కాంగ్రెస్ ఎన్నికల హామీలో ఎలక్ట్రానిక్ స్కూటీ పథకం ప్రకటించడంతో కొత్తగా ఓటు హక్కు వినియోగించుకున్న విద్యార్థినీలలో ఆశలు రేకేత్తిస్తున్నాయి. ఉచిత ఎలక్ట్రానిక్ విద్యార్థినీలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పేద విద్యార్థులకు రోజువారి రవాణా ఖర్చులు ఇబ్బందులు తగ్గుతాయి. పెట్రోల్ ఖర్చులు ఉండనందున ఇంటి అవసరాలకు సైతం బైక్ను వాడుకోవచ్చు. ఈ ఎలక్ట్రానిక్ స్కూటీ ల వలన విద్యార్థినులకు సమయం ఆదా అవుతుంది. ఎలాంటి ఖర్చు లేకుండా అనుకున్న గమ్యానికి త్వరగా చేరుకుంటారు. అంతేకాకుండా అమ్మాయిలకు స్కూటీ రక్షణగా ఉంటుంది. ఏ సమయంలోనైనా బయటికి వెళ్లి రావచ్చు. ఎలక్ట్రిక్ స్కూటీలు పంపిణీ చేసి కాంగ్రెస్ మాట నిలబెట్టుకోవాలని విద్యార్థినులు కోరుకుంటున్నారు.

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది