CM Revanth Reddy : అసెంబ్లీలో సాక్షి పరువు తీసిన రేవంత్ రెడ్డి .. కేసీఆర్ – వైఎస్ జగన్ సీక్రెట్స్ మొత్తం బయట పెట్టిన సీఎం..!
ప్రధానాంశాలు:
CM Revanth Reddy : అసెంబ్లీలో సాక్షి పరువు తీసిన రేవంత్ రెడ్డి .. కేసీఆర్ - వైఎస్ జగన్ సీక్రెట్స్ మొత్తం బయట పెట్టిన సీఎం..!
CM Revanth Reddy : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇరిగేషన్ శాఖ పై అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. కేసీఆర్, హరీష్ రావు కలిసి ప్రాజెక్టుల పేరుతో దోచుకున్నారని వ్యాఖ్యలు చేశారు. సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గోదావరి జలాల వినియోగంపై అధికారులు పూర్తి నివేదిక ఇచ్చారని, రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన నివేదికలోని అంశాలను సభ ముందు ఉంచుతున్నానని, రాష్ట్రంలో అన్యాయం జరిగిందని, ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం జరిగిందని అన్నారు. కాళేశ్వరం నుంచి నీటి తరలింపు ఆర్థిక భారం అని నిపుణులు అప్పుడే చెప్పారు. మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణం సరికాదని కేసీఆర్ కు నిపుణులు తెలియజేశారు. 14 పేజీలతో రిటైర్డ్ ఇంజనీర్లు నివేదిక ఇచ్చారు. కేసీఆర్ వేసిన నిపుణుల కమిటీ ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు సాధ్యమని నివేదిక ఇచ్చింది.
మేడిగడ్డ కట్టాలన్నది కేసీఆర్ ఆలోచన. మేడిగడ్డ ప్రాజెక్టు కట్టాలని కేసీఆర్ ఆదేశించారు. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను తొక్కిపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజానీకానికి ఆటంకంగా మారింది. దోచుకోవాలని దాచుకోవాలని ఆలోచనతోనే మేడిగడ్డ నిర్మించారు. కూలిన ప్రాజెక్టును చూసి సిగ్గుపడాలి. ప్రతిపక్షం సలహాలు, సూచనలు ఇవ్వకుండా ఎదురు దాడి చేస్తుంది. తెలంగాణ ఇచ్చింది మేమే. తెచ్చింది కూడా మేమే. ఇకనైనా తప్పులు ఒప్పుకోండి కప్పిపుచ్చుకోండి అని అన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఆటంకాలు తొలగించడానికి బోర్డు కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేశారు. హరీష్ రావు, కేసీఆర్ కలిసి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారు. వాళ్లు నియమించుకున్న ఇంజనీర్ల కమిటీతో నివేదిక ఇప్పించుకున్నారు. తుమ్మిడి హట్టి దగ్గర ప్రాజెక్టు కట్టాలని నివేదిక ఇప్పించుకున్నారు.
ఇక తొమ్మిది సంవత్సరాల క్రితం మేడిగడ్డ మేడిపండేనా అని సాక్షి దినపత్రికలో కథనం కూడా వచ్చింది. కేసీఆర్ దోస్తీ అయిన వైయస్ జగన్మోహన్ రెడ్డి సొంత పత్రికలోనే మిత్రుడికి వ్యతిరేకంగా మేడిగడ్డపై కథనం రాశారు అని అన్నారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ కట్టడం సరికాదు కాబట్టే సాక్షి దినపత్రిక కూడా దానిపై కథనం కూడా రాసింది. ప్రజలు నమ్మి పదేళ్లు అధికారం ఇస్తే తెలంగాణను నిండా ముంచారు. కాళేశ్వరం తో చేవెళ్లకు అన్యాయం చేశారని ఆనాడు సబితా ఇంద్రారెడ్డి ధర్నా చేశారు. నేడు ఇదే సభలో హరీష్ రావు అబద్ధాలు చెబుతుంటే ఏం మాట్లాడకుండా సైలెంట్ గా చూస్తున్నారు. ప్రాజెక్టులకు సాగునీటి మంత్రిగా కొనసాగి ఆ తర్వాత హరీష్ రావు ని ఎందుకు భర్తరఫ్ చేశారు. విచారణకు వెళ్లి ఇప్పటికైనా తప్పును ఒప్పుకోండి అంటూ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు చేశారు.