Roja : టీడీపీ – జనసేన పొత్తులకు సంబంధించి లోకేష్ వర్సెస్ రోజా..!!
Roja : సెప్టెంబర్ 14వ తారీకు గురువారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో ములాఖాత్ కావటం తెలిసిందే. ఈ భేటీ అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైల్ బయట మీడియా సమావేశంలో వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీతో కలిసి జనసేన పోటీ చేయబోతున్నట్లు ప్రకటన చేయటం జరిగింది. ఈ ప్రకటన ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసింది. ఈ క్రమంలో నారా లోకేష్ మాట్లాడుతూ… జనసేన తో పొత్తు రెండు పార్టీలు కలిసి పోటీ చేయటం కేవలం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం తీసుకున్న నిర్ణయం అని చెప్పుకొచ్చారు.
ఈ నిర్ణయం ప్రజలను కాపాడటం కోసమే అని పేర్కొన్నారు. కలిసికట్టుగా పోరాటం చేయడానికి రెండు పార్టీల నుండి జాయింట్ కమిటీ వేయటానికి సిద్ధమైనట్లు లోకేష్ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకోవడాని గురించి పవన్ కళ్యాణ్ పై రోజా సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. దేశంలో తనకు తెలిసి పార్టీ పెట్టి.. పక్క పార్టీల గెలుపు కోసం సొంత కార్యకర్తల చేత జెండాలు మోయించే నాయకుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు. తన తల్లిని దూషించిన వ్యక్తులతోనే పవన్ పొత్తులు పెట్టుకుంటున్నాడు. నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే ఏనాడైనా పవన్ ప్రజా పోరాటం చేశారా అని రోజా ప్రశ్నించారు.
కానీ ప్రజాధనం లూటీ చేసిన చంద్రబాబు కోసం.. పోరాటం చేస్తానంటూ మీడియా సమావేశాలు పెట్టడం విడ్డూరమని అన్నారు. ఇదే పోరాటం చంద్రబాబు హయాంలో రాజమండ్రిలో 29 మంది చనిపోతే ఎందుకు పోరాటం చేయలేదు అని ప్రశ్నించారు. కేవలం ప్యాకీజీ కోసమే పవన్ ఈ విధంగా చంద్రబాబుతో కలసి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.