Ali VS Pawan Kalyan : అలీ.. నువ్వేంటో, నీ విలువలు ఏంటో నాకు తెలుసు కానీ.. అంటూ అలీకి పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ali VS Pawan Kalyan : అలీ.. నువ్వేంటో, నీ విలువలు ఏంటో నాకు తెలుసు కానీ.. అంటూ అలీకి పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్?

 Authored By kranthi | The Telugu News | Updated on :15 November 2023,11:00 am

ప్రధానాంశాలు:

  •  ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెడితే వద్దంటున్నారు

  •  మన పిల్లలు ఎదగకూడదా?

  •  మేము ఇంగ్లీష్ మీడియం స్కూళ్లకు ఏనాడూ వ్యతిరేకం కాదు

Ali VS Pawan Kalyan : సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కమెడియన్ అలీ ఇద్దరూ జాన్ జిగ్రీ దోస్తులు. కానీ.. రాజకీయాల్లోకి వస్తే మాత్రం ఇద్దరూ ఈ మధ్య బద్దశత్రువులు అయిపోయారు. దానికి కారణం.. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టడం, వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడటం, ఆ తర్వాత అలీ వైసీపీలో చేరడం. వైసీపీ వర్సెస్ జనసేన అన్నట్టుగా ప్రస్తుతం పరిస్థితులు ఉన్నాయి. దీంతో నేరుగానే అలీ.. పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తున్నారు. వాళ్ల మధ్య గ్యాప్ ఉందని చెప్పడానికి ఈ మధ్య వస్తున్న సినిమాలే నిదర్శనం. ఎందుకంటే.. పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఈ మధ్యన అలీ కనిపించడం లేదు. అలీ స్థానంలో వేరే కమెడియన్లు కనిపిస్తున్నారు. అంటే.. ఇద్దరి మధ్య పక్కాగా గ్యాప్ ఉంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. ఇండస్ట్రీలో పవన్, అలీ ఇద్దరికీ ఒకే రకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే.. ఇద్దరి మధ్య ఉండే గ్యాప్ ను దూరం చేయడం కోసం అటు ఫ్యాన్స్ కూడా తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ.. ఇద్దరి మధ్య మాత్రం విభేదాలు రోజురోజుకూ పెరుగుతూ పోతున్నాయి.

ఈ మధ్య అలీ.. ఎక్కడైనా మాట్లాడితే డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం అలీ పేరు ఎత్తకుండా ఇన్ డైరెక్ట్ గా కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్య ఆ గ్యాప్ అలాగే పెరుగుకుంటూ వెళ్లింది. వైఎస్ జగన్ ను తెగ పొగిడేస్తూ.. పవన్ కళ్యాణ్ ను మాత్రం తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు అలీ. ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ తనకు ఎంత సాయం చేశారు అనే విషయం కూడా మరిచిపోయి అలీ.. పవన్ కళ్యాణ్ పై రెచ్చిపోవడం ఏంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు. మన పిల్లలు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలి.. మన పిల్లలు మంచి స్థాయిలో ఉండాలని చెప్పి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ తీసుకొచ్చారు. అలాంటి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ మనకు వద్దా.. ఎందుకు ప్రతిపక్ష పార్టీలు రాద్దాంతం చేస్తున్నాయి అంటూ అలీ మండిపడ్డారు.

Ali VS Pawan Kalyan : ఇంగ్లీష్ మీడియం స్కూళ్లకు మేము వ్యతిరేకం కాదు

ఇంగ్లీష్ మీడియం స్కూళ్లకు, టోఫెల్ కు మేము వ్యతిరేకం కాదు కానీ.. మూడో తరగతి, నాలుగో తరగతి విద్యార్థులకు టోఫెల్ అనే సరికి మేము దాని మీద వ్యతిరేకత చూపించాం. ఏదైనా ఒక యాక్సెంట్ తోనే ఇంగ్లీష్ నేర్చుకోవాలా? యాక్సెంట్ లేకపోతే మనం మాట్లాడే ఇంగ్లీష్ పనికిరాదా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా గొప్ప యాక్సెంట్ తో మాట్లాడరు కదా. పిల్లలకు మనం నేర్పించాల్సింది సృజనాత్మకత, క్రియేటివిటీ. ఈ క్రాస్ సెక్షన్స్ నుంచి వాటిని క్రియేటివ్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో చూడాలి కానీ.. ఇంగ్లీష్ నేర్చుకుంటేనే జరుగుతుందా? అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది