Telangana Congress : తెలంగాణలో హస్తానిదే అధికారం.. గెలుపు లెక్కలు ఇవే?
Telangana Congress : తెలంగాణలో ఎన్నికలకు శంఖారావం పూరించారు. ఇంకో మూడు నెలల్లోనే ఎన్నికలు జరగబోతున్నాయి. అందుకే తెలంగాణలోని ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ పార్టీ ఎలాగైనా గెలవాలన్న కసితో ఉంది. దానికి కారణం మూడోసారి కూడా గెలిచి సత్తా చాటాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇక.. కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణలో జోరుమీదుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకే ఎక్కువగా బలం కూడా ఉండటంతో ఇంకొంచెం కష్టపడితే తెలంగాణలో గెలవడం పెద్ద కష్టమేమీ కాదు. 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. పరిస్థితులు మారాయి. అందుకే కాంగ్రెస్ పార్టీ ఈసారి గెలుపు మీద ధీమా వ్యక్తం చేస్తోంది.
ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యంతో ముందుకు అడుగులు వేస్తోంది కాంగ్రెస్. 119 నియోజకవర్గాల్లో మెజారిటీ సీట్లు సాధించేలా ముందుకు సాగుతోంది. అందుకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. పొత్తుల లెక్కలను కూడా కొలిక్కి తీసుకొస్తోంది కాంగ్రెస్. నిజానికి తెలంగాణలో ఏ పార్టీ అయినా పొత్తు పెట్టుకోవాలంటే అవి వామపక్షాలతోనే. సీపీఐ, సీపీఎం ఈ రెండు పార్టీలో మొన్నటి వరకు బీఆర్ఎస్ కలిసి నడించింది. కానీ.. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి నడవాలని బీఆర్ఎస్ అనుకోవడం లేదు.ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ, వామపక్ష పార్టీలు ఉన్న విషయం తెలిసిందే. అదే కూటమిని తెలంగాణ ఎన్నికల్లో కంటిన్యూ చేయాలని వామపక్షాలు భావిస్తున్నాయి. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు కలిసి పోటీ చేస్తే బాగుంటుందని.
Telangana Congress : కాంగ్రెస్ తో నడవనున్న వామపక్షాలు?
తమకు కొన్ని సీట్లు ఇస్తే చాలని వామపక్షాలు.. కాంగ్రెస్ హైకమాండ్ కు చెప్పినట్టు తెలుస్తోంది. భద్రాచలం, ఖమ్మం, కొత్తగూడెం, బెల్లంపల్లి, హుస్నాబాద్, మునుగోడు సీట్లను మాత్రం వామపక్షాలు అడుగుతున్నాయి. కాంగ్రెస్ కూడా వామపక్షాలతోనే కలిసి తెలంగాణలో నడవాలని భావిస్తోంది. ఎలాగూ ఈసారి కాంగ్రెస్ పార్టీకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో వామపక్షాలతో కలిసి పోటీ చేయడం వల్ల అది ఇంకా ప్లస్ కానుంది. అందుకే సీపీఐ, సీపీఎం పార్టీలకు ఓ ఐదారు సీట్లు ఇచ్చేసి వారి సపోర్ట్ తో తెలంగాణలో అధికారం సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తోంది.