CV Anand | బౌన్స‌ర్స్ ఓవ‌ర్ యాక్ష‌న్ చేస్తే తాట తీస్తామంటూ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వార్నింగ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

CV Anand | బౌన్స‌ర్స్ ఓవ‌ర్ యాక్ష‌న్ చేస్తే తాట తీస్తామంటూ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వార్నింగ్

 Authored By sandeep | The Telugu News | Updated on :22 December 2024,6:30 pm

CV Anand | గ‌త కొద్ది రోజులుగా సంధ్య థియేట‌ర్ ఇష్యూ చ‌ర్చ‌నీయాంశంగా మార‌డం మ‌నం చూశాం. ఇందులో బాద్యులు ఎవ‌రైన కాని ఓ నిండు ప్రాణం బ‌లైంది. అయితే ఈ కేసు విషయంలో గ‌త కొద్ది రోజులుగా డిస్క‌ష‌న్ న‌డుస్తుండ‌గా, తాజాగా ఈ ఇష్యూపై సీపీ సీవీ ఆనంద్ స్పందించారు. బౌన్సర్లు ప‌ బ్లిక్‌ను ఎక్కడైనా తోసివేస్తే తాటతీస్తామని స్పష్టం చేశారు. బౌన్సర్ల తీరుకు సెలబ్రిటీలదే బాధ్యత అని చెప్పారు. ముఖ్యంగా యూనిఫాంలో ఉన్న పోలీసులను టచ్ చేసినా.. ఆ తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. బౌన్సర్లను సప్లై చేసే ఏజెన్సీలు కూడా బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.

#image_title

వారికి వార్నింగ్..

అల్లు అర్జున్‌ వచ్చేందుకు థియేటర్‌ వాళ్లు దరఖాస్తు చేస్తే తిరస్కరించామని సీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు. థియేటర్‌ వాళ్లు అల్లు అర్జున్‌కు విషయం చెప్పారో.. లేదో తమకు తెలియదని అన్నారు. సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై మాట్లాడిన అనంతరం బౌన్సర్ల సప్లై ఏజెన్సీలకు హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ స్ట్రాంగ్ వార్నింగ్‌ ఇచ్చారు. బౌన్సర్లు ఇకపై పోలీసులను ముట్టుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే.. ఊరుకునేది లేదని అన్నారు. బౌన్సర్ల ప్రవర్తనకు సప్లై ఏజెన్సీలదే పూర్తి బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రజల ఇబ్బంది గురించి ఆలోచించే బాధ్యత వీఐపీలదే అని పేర్కొన్నారు.దయచేసి థియేటర్‌ నుంచి వెళ్లిపోండి అని అల్లు అర్జున్‌కు డీసీపీ నేరుగా వెళ్లి చెప్పారని వివరించారు.

తొక్కిసలాట విషయం అల్లు అర్జున్‌ దృష్టికి తీసుకెళ్లానని, మహిళ చనిపోయింది, బాలుడి పరిస్థితి విషమంగా ఉందని చెప్పానని చిక్కడపల్లి ఏసీపీ రమేష్ వెల్లడించారు. అప్పుడు సినిమా మొత్తం చూశాకే తాను వెళ్తానని అల్లు అర్జున్‌ అన్నాడని చెప్పారు.హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు వద్ద ఉన్న సంధ్య థియేటర్‌లో పుష్ప2 విడుదల సందర్భంగా తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తెలంగాణ అసెంబ్లీలోనూ చర్చ జరిగింది. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ మాట్లాడిన తర్వాత.. అల్లు అర్జున్‌ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తనపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని వాపోయారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తొక్కిసలాట ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. 10 నిమిషాలు చూసిన తర్వాత డీసీపీ ఆదేశాల మేరకు అల్లు అర్జున్‌ను బయటకు తీసుకొచ్చామని వివరించారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది