Cyber Frauds : స్మార్ట్ ఫోన్‌ను గిఫ్ట్‌గా పంపి రూ.2.8 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు..!
ప్రధానాంశాలు:
స్మార్ట్ ఫోన్‌ను గిఫ్ట్‌గా పంపి రూ.2.8 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
Cyber Frauds : సైబర్ మోసగాళ్ళు ఒక సీనియర్ సిటిజన్ కు క్రెడిట్ కార్డు కోసం కాంప్లిమెంటరీ గిఫ్ట్ గా బగ్డ్ మొబైల్ ఫోన్ పంపి అతని ఖాతా నుండి రూ.2.8 కోట్లు కాజేసినట్లు పోలీసులు తెలిపారు. బెంగళూరుకు చెందిన 60 ఏళ్ల బాధితుడు రాయ్ కు నవంబర్ 2024 లో సిటీ బ్యాంక్ అధికారి అని చెప్పుకుంటూ ఒక గుర్తు తెలియని వ్యక్తి నుండి వాట్సాప్ కాల్ వచ్చింది. రాయ్ పేరు మీద క్రెడిట్ కార్డ్ ఆమోదించబడిందని మోసగాడు పేర్కొన్నాడు..
Cyber Frauds : స్మార్ట్ ఫోన్‌ను గిఫ్ట్‌గా పంపి
డిసెంబర్ 1న మోసగాళ్ళు రాయ్ వైట్‌ఫీల్డ్ చిరునామాకు రూ. 10,000 విలువైన రెడ్‌మి మొబైల్ ఫోన్‌ను పంపారు. వారు మళ్ళీ అతన్ని సంప్రదించి, వారు పంపిన మొబైల్ ఫోన్‌కు అతని సిమ్‌ను మార్చమని సూచించారు. చెప్పినట్లుగానే రాయ్ తన సిమ్ కార్డును అదే రోజు వారు పంపిన మొబైల్ ఫోన్‌కు మార్చాడు. ఆ తర్వాత అతడి బ్యాంకు నుండి వారు రూ. 2.8 కోట్లు కాజేశారు. అయితే తనకు ఎటువంటి నోటిఫికేషన్లు రాలేదని అని రాయ్ పోలీసులకు చెప్పాడు. బ్యాంకులో తనిఖీ చేసినప్పుడు విషయం వెలుగులోకి వచ్చినట్లు పేర్కొన్నాడు.
ఐటీ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద వైట్‌ఫీల్డ్ CEN పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది. ఈ కేసు దర్యాప్తులో ఉందని, ప్రాథమికంగా చూస్తే మోసగాళ్ళు డేటాను దొంగిలించడానికి మొబైల్ ఫోన్‌ను క్లోన్ చేసినట్లు తెలుస్తోందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (వైట్‌ఫీల్డ్) శివకుమార్ గుణారే తెలిపారు…