Pension : కొత్త ప్ర‌భుత్వంలో ఇంటింటికి ఫించ‌ను ఉన్న‌ట్టా.. లేన‌ట్టా..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Pension : కొత్త ప్ర‌భుత్వంలో ఇంటింటికి ఫించ‌ను ఉన్న‌ట్టా.. లేన‌ట్టా..!

Pension : ఏపీలో కొత్త ప్ర‌భుత్వం కొలువుదీరింది. వైసీపీ ప్ర‌భుత్వంపై భారీ మెజారిటీతో గెలిచిన కూట‌మి ప్ర‌భుత్వం ఇప్పుడు పాల‌న‌ని ఎలా సాగించాలి అనే దానిపై క‌స‌ర‌త్తులు చేస్తుంది. అయితే గ‌త‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పించన్లు పంపిణీ సహా అనేక ఇతర ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకే చేర్చడం కోసం వాలంటీర్‌ వ్యవస్థను తీసుకువచ్చారు. ప్రతి నెల ఒకటో తారీఖు ఉదయాన్నే వాలంటీర్లు లబ్ధిదారుల ఇంటి వద్దకు చేరుకుని.. వారికి పింఛన్‌ అందించేవారు. వృద్ధులు, […]

 Authored By ramu | The Telugu News | Updated on :24 June 2024,4:00 pm

Pension : ఏపీలో కొత్త ప్ర‌భుత్వం కొలువుదీరింది. వైసీపీ ప్ర‌భుత్వంపై భారీ మెజారిటీతో గెలిచిన కూట‌మి ప్ర‌భుత్వం ఇప్పుడు పాల‌న‌ని ఎలా సాగించాలి అనే దానిపై క‌స‌ర‌త్తులు చేస్తుంది. అయితే గ‌త‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పించన్లు పంపిణీ సహా అనేక ఇతర ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకే చేర్చడం కోసం వాలంటీర్‌ వ్యవస్థను తీసుకువచ్చారు. ప్రతి నెల ఒకటో తారీఖు ఉదయాన్నే వాలంటీర్లు లబ్ధిదారుల ఇంటి వద్దకు చేరుకుని.. వారికి పింఛన్‌ అందించేవారు. వృద్ధులు, వికలాంగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే వారు. అయితే ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌లైన స‌మ‌యంలో వాలంటీర్ల ద్వారా పింఛన్‌ పంపిణీ అడ్డుకోవాలని కోరుతూ.. చంద్రబాబు అండ్‌ కో ఎన్నికల సంఘాన్ని కోరారు. దాంతో కొద్ది రోజ‌ల నుంచి పింఛన్ల పంపిణీ వ్యవహారం తీవ్ర గందరగోళంగా మారింది.

Pension పించ‌న్ల‌పై సస్పెన్స్..

అయితే జూలై నెల‌లో సామాజిక భ‌ద్ర‌తా పించ‌న్లు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే వాటి కోసం ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. కాని ఈ సారి కూడా ఇంటింటికి పంపిణీ చేసే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. అందుకు కార‌ణం ఏప ప్ర‌భుత్వం ఇంకా వాలంటీర్ వ్య‌వ‌స్థ‌పై దృష్టి పెట్ట‌క‌పోవ‌డ‌మే. గ‌తంలో చంద్ర‌బాబు తాము అధికారంలోకి వ‌స్తే జూలై 1న ఇంటింటికీ పింఛ‌న్లు పంపిణీ చేసే బాధ్య‌తను తీసుకుం టామ‌ని చెప్పుకొచ్చారు. వలంటీర్ల ద్వారా నే పించ‌న్లు పంపిణీ చేస్తా మ‌న్నారు. ఇక‌, పింఛ‌న్ల పెంపు అంశంపై మాత్రం అంత‌ర్మ‌థ‌నం చెందుతున్నా.. సొమ్ములు స‌మ‌కూర్చా ల‌ని సంబంధిత అధికారుల‌కు ఆదేశాలు పంపించినా.. ఇంటింటికీ పంపిణీ చేసే విష‌యంలో మాత్రం కాస్త సంశ‌యిస్తున్నారు.

Pension కొత్త ప్ర‌భుత్వంలో ఇంటింటికి ఫించ‌ను ఉన్న‌ట్టా లేన‌ట్టా

Pension : కొత్త ప్ర‌భుత్వంలో ఇంటింటికి ఫించ‌ను ఉన్న‌ట్టా.. లేన‌ట్టా..!

పించ‌న్లు ఇచ్చేందుకు కేవంలం ఆరు రోడుల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. మ‌రి ప్ర‌భుత్వం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుంది అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు ఉన్న‌వారిని కొన‌సాగిస్తారా, లేకుంటే కొత్త వారిని తీసుకుంటారా అనే దానిపై క్లారిటీ లేదు. పాత వారి నుంచి ద‌ర‌ఖాస్తులు తీసుకుని స్క్రూటినీ చేసుకుని.. నియామ కాలు చేప‌ట్టేందుకు ఎంత లేద‌న్నా.. వారం రోజులు ప‌డుతుంది కాబ‌ట్టి వ‌చ్చే నెల ఇంటింటికి పించ‌న్ల అందిచండం కాస్త క‌ష్ట‌త‌మ‌రమైన ప‌నే అంటున్నారు. ఇప్పుడు ఎలాగు అల‌వాటు ప‌డ్డారు కాబ‌ట్టి మెల్ల‌గా ప్ర‌భుత్వం ఇంటింటికి పించ‌న్ల‌కి చెక్ పెట్టే ప్ర‌య‌త్నం చేస్తుందా అనేది చూడాలి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది